»Shocking Bhagavanth Kesari Three And A Half Crore Song Out
Bhagavanth Kesari:లో మూడున్నర కోట్ల సాంగ్ ఔట్?
ఇంకొన్ని గంటల్లో బాలయ్య నటించిన భగవంత్ కేసరి రిలీజ్ కాబోతోంది. ఇలాంటి సమయంలో ఓ షాకింగ్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది. ఈ సినిమాలోని ఓ సాంగ్ కోసం మూడున్నర కోట్లు ఖర్చు చేశారట. కానీ ఇప్పుడా సాంగ్‌ను లేపేసినట్టుగా తెలుస్తోంది.
Bhagavanth Kesari OTT Streaming date and Release Partner
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari).. అక్టోబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లోకి వస్తోంది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో.. భగవంత్ కేసరి పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్.. ఇది పక్కా అనిల్ రావిపూడి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతోందని చెప్పేసింది. పైగా బాలయ్య తొలిసారి తెలంగాణ యాసలో చేస్తున్న చిత్రం ఇదే. మొత్తంగా సాలిడ్ బజ్‌తో థియేటర్లోకి రాబోతోంది భగవంత్ కేసరి. అయితే.. ముందు నుంచి ఈ సినిమాలో బాలయ్య ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్‌ని రీమీక్స్ చేసినట్టుగా వార్తలు వస్తునే ఉన్నాయి. మంగమ్మగారి మనవడు సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘దంచవే మేనత్త కూతురా’ పాటని రీమిక్స్ చేశారట. అంతేకాదు.. ఈ పాటను చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారట. అందుకోసం ఏకంగా మూడున్నర కోట్లు ఖర్చు చేశారట.
కానీ లాస్ట్ మినిట్‌లో ఈ సాంగ్(song)ను లేపేసినట్టుగా తెలుస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు అంటున్నారు. కథ ప్రకారం.. సినిమాలో ఈ సాంగ్ కాస్త డిస్టర్బ్(disturbed)గా అనిపించిందట. రిలీజ్‌కు ముందు బాలయ్య ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులకు భగవంత్ కేసరి చిత్రాన్ని స్పెషల్ ప్రీమియర్ షో వేసినట్టుగా తెలుస్తోంది. వారంతా ఈ రీమిక్స్ సాంగ్ వద్దని సలహా ఇచ్చారట. కథ ఫ్లోని సాంగ్ దెబ్బతీసే విధంగా ఉందని ఫీడ్ బ్యాక్ రావడంతో.. అనిల్ రావిపూడి ఆ సాంగ్ ఎడిటింగ్ రూమ్‌కే పరిమితం చేసినట్టుగా తెలుస్తోంది. కానీ సినిమా రిలీజ్ అయి సాలిడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటే.. సెకండ్ వీక్‌లో ఈ సాంగ్‌ను యాడ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఏదేమైనా.. ఒక్క పాటకు మూడున్నర కోట్లు ఖర్చు చేయడం విశేషం.