తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై మరో నటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమని (Amani).. క్యాస్టింగ్ కౌచ్ కి గురైనట్లు వెల్లడించారు. జంబలకిడిపంబ(Jambalakidipamba)సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆమనికి పస్ట్ మూవీతోనే బిగ్ హీట్ అందుకున్నారు. ఆ తరువాత బాపు డైరెక్షన్(Directed by Bapu)లో వచ్చిన మిస్టర్ పెళ్ళాం ఆమనికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆమూవీకి గాను జాతీయ ఫిల్మ్ అవార్డు (Film Award) అందుకున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాల్లో మదర్ రోల్స్ చేస్తూ.. మరోవైపు బుల్లితెరపై పలు టీవీ షోస్ కూడా చేస్తున్నారు. అయితే తాజాగా ఈమె క్యాస్టింగ్ కౌచ్ (Casting couch) గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఆమని మాట్లాడుతూ.. “క్యాస్టింగ్ కౌచ్” సమస్య ఎప్పటి నుంచో ఉందని.. కానీ ఎవరికీ తెలియదని అన్నారు.
ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా (Social media) లేదు. దాని వలన క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చునని అన్నారు. ఏ వృత్తిలో అయినా సరే మంచి, చెడు, రెండు ఉంటాయని.. హీరోయిన్స్ (Heroines) గా అది మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె తెలిపారు. తమిళం(Tamil)లో తనకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందని ఆమె వెల్లడించారు.ఓ సినిమాలో స్విమింగ్ పూల్ సీన్ కోసం ఓ దర్శకుడు తనను డ్రెస్ తీసి స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయేమో చూడాలని అన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే ఆ దర్శకుడు చెప్పిన మాటలకు తాను ఒప్పుకోలేదని.. ఇలాంటి వ్యక్తులు కేవలం వాటి కోసమే వస్తారని ఆమె అన్నారు. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ చేయనని వారి ముఖం మీదనే చెప్పేసానని ఆమె అన్నారు.
మరో డైరెక్టర్ (Director) అయితే స్టోరీ గురించి మాట్లాడాలి అంటే ఒప్పుకున్నానని ఆమె అన్నారు. అయితే మేనేజర్ ఫోన్ చేసి.. ఒక్కదానివే రావాలని.. నీతో ఎవరూ రాకూడదని అన్నాడని.. అయితే తాను వెళ్లలేదని ఆమె అన్నారు. ఇలాంటి అనుభవాలు తనకు చాలానే ఎదురయ్యాయని కొంత మంది దర్శకులు స్టోరీ (Story) గురించి మాట్లాడాలి, రావాలంటూ ఫోన్ చేసేవారు. అప్పుడు ఈ విషయాలు నాకు అంతగా అర్ధమయ్యేవి కావు. ఓ డైరెక్ట్ స్టోరీ గురించి మాట్లాడ్డానికి బీచ్(Beach)కు రమ్మన్నాడు.ఓ ఫైనాన్షియర్ మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాడు అని మేనేజర్ చెప్పాడు. అప్పుడు నేను దర్శక నిర్మాతలకి నచ్చాలి గాని, ఫైనాన్షియర్(Financier)కి నచ్చడం ఏంటని అడిగాను. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇలాంటి పలు సంఘటనలు ఎదుర్కొన్నానంటూ ఆమని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమని చేసిన కామెంట్స్ (Comments) ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. తన రంగు గురించి కూడా చాలా మంది వల్గర్ గా మాట్లాడారని ఆమని ఆవేదన వ్యక్తం చేసింది.
చదవండి :Viral news: భార్య కాపురానికి రావట్లేదని..అల్లుడి దారుణం