గత కొంత కాలంగా సరైన హిట్ అందుకోలేకపోయిన యంగ్ హీరో శర్వానంద్.. ఈ ఏడాది వచ్చిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో భారీ ఆశలు పెట్టుకొని ఈ వారం ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శర్వానంద్. శ్రీకార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్గా నటించగా.. అమల అక్కినేని కీలక పాత్రలో నటించింది. డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో ఇది శర్వానంద్‌కు కలిసొచ్చే సమయం అనే చెప్పాలి. ఈ వారం విడుదలైన సినిమాల్లో బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర మాత్రమే రేసులో ఉంది.
ఒకటి అర డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయినా బ్రహ్మాస్త్ర, ఒకే ఒక జీవితం సినిమాలపై ఉన్నంత హైప్ లేదు. అయితే బ్రహ్మాస్త్రకు బాగుందనే టాక్ ఉన్న.. ఒకే ఒక జీవితం తెలుగు సినిమా కావడంతో పాటు.. పాజిటివ్ టాక్ రావడంతో శర్వానంద్ మంచి హిట్ కొట్టాడనే చెప్పాలి. ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ‘ఒకే ఒక జీవితం’ రిజల్ట్‌ను బట్టి రేటు ఫిక్స్ చేసుకున్నారట. హిట్ అయితే 11 కోట్లు.. యావరేజ్ అయితే 8 కోట్లు చెల్లిస్తామని ఓటిటి సంస్థ, మూవీ మేకర్స్ ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ఇక సినిమాకు హిట్ టాక్ రావడంతో ఓటీటీ రైట్స్ అనుకున్న దానికంటే ఎక్కువ రేటుకే అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. ఏదేమైనా శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కాడనే చెప్పాలి.
ఇటీవలె రక్షితా రెడ్డిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయ్యాడు యంగ్ హీరో శర్వానంద్. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేస్తున్నాడు. కానీ అప్పుడే సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.