Samantha: వరస సినిమాలతో సమంత (Samantha) బిజీగా ఉన్నారు. యశోద ఓ మోస్తరు ఆడినా.. శకుంతల నిరాశపరిచిన కొత్త ప్రాజెక్టులను చేస్తోంది. తెలుగు, మళయాళం కాదు.. హిందీ, వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్నారు. సిటడెల్ అనే హిందీ వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేయనున్నారు. ఓ హాలీవుడ్ మూవీకి సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.
చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ మూవీలో సమంత (Samantha) నటించనుంది. ఇందులో హాలీవుడ్ యాక్టర్ వివేక్ కల్రా హీరోగా చేస్తారు. ఈ మూవీని ఫిలిప్ జాన్ డైరెక్ట్ చేస్తారు. ఇంగ్లాండ్కు చెందిన యువకుడు, చెన్నైకి చెందిన యువతికి మధ్య జరిగే ప్రేమ కథగా సినిమా ఉండనుంది. త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. తెలుగు, తమిళం, హిందీ సినిమాలు చేసిన సమంత.. ఇప్పుడు హాలీవుడ్ సినిమా చేయబోతున్నారు. 36 ఏళ్ల వయస్సులో కూడా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. ఎక్స్ పోజింగ్కు కూడా వెనకాడటం లేదు. తెలుగులో విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషి మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
సమంత (Samantha) చేతిలో సినిమాలు ఉన్నాయి. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా మూవీస్ చేస్తున్నారు. చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటికీ.. హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇటీవల హైదరాబాద్ శివారులో ఖరీదైన బంగ్లా కొనుగోలు చేశారు. ఇప్పటికే జూబ్లీహిల్స్లో రూ.వంద కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే.