అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ షాక్ ఇచ్చేలా ఉంటాయి. తాజాగా ఓ షాకింగ్ పుకారు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అక్కినేని అఖిల్‌తో సమంత రొమాన్స్ చేయబోతుందనే రూమర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇలాంటి వార్తల్లో నిజముందా?
నాగ చైతన్య(Akkineni Naga Chaitanya)తో విడిపోయిన తర్వాత అక్కినేని ఫ్యామిలీ దూరమైంది సమంత(Actress Samantha). కానీ నాగ చైతన్య బ్రదర్ అఖిల్‌తో మాత్రం.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో టచ్‌లోకి వస్తుంది. ఆ మధ్య అఖిల్‌కు బర్త్ డే విష్ కూడా చేసింది. దీంతో అన్నతోనే గొడవ కానీ.. తమ్ముడితో ఏం ఉంటుందిలే అనుకొని.. ఈ ఇద్దరి మధ్య ఇంకా మంచి బాండింగ్ ఉందని ఫిక్స్ అయిపోయారు. అందుకేనేమో ఇప్పుడు ఏకంగా అఖిల్ సరసన సమంత నటించబోతుందనే రూమర్ వైరల్‌గా మారింది. ఏజెంట్ మూవీతో ఘోరమైన ఫ్లాప్ అందుకున్న అఖిల్.. నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇప్పటికే అఖిల్ యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమాకు కమిట్ అయిపోయాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌ను ‘వి మెగా పిక్చర్స్’ పై రామ్ చరణ్ నిర్మించబోతున్నాడనేది లేటెస్ట్ టాక్. ఈ సినిమాకు అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు ‘ధీర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ సినిమాలో సమంత కూడా నటించబోతుందనే రూమర్ వైరల్‌గా మారింది. అంతేకాదు.. సమంత(Actress Samantha) కూడా అందుకు ఓకె చెప్పినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆమె హీరోయిన్గా నటించనుందా? లేక కీ రోల్ ప్లే చేయనుందా? అనేది మరో క్వశ్చన్ మార్క్. ఇదేకాదు.. గతంలోను నాగ చైతన్య, సమంత కలిసి నందిని రెడ్డితో ఓ సినిమా చేస్తున్నారనే గాసిప్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు అఖిల్‌తో సమంత సినిమా అంటున్నారు. అయితే సినిమా అనేది సామ్ ప్రొఫెషన్ కాబట్టి.. ఏదైనా జరగొచ్చు.