సమంత గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే సడెన్‌గా సామ్ ఎందుకు సైలెంట్ అయిందనే విషయం.. అభిమానుల్లో రకరకాల సందేహాలకు దారి తీసింది. ఏదో హెల్త్ ఇష్యూ కారణంగా అమెరికా వెళ్లిందని.. అప్ కమింగ్ ఫిల్మ్స్ కోసం ట్రైనింగ్ తీసుకుంటోందని.. వార్తలు వినిపించాయి.
కానీ తాజాగా తిరిగి సామ్ లైన్లోకి వచ్చినట్టేనని చెప్పొచ్చు. మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివేట్ అయిపోయింది అమ్మడు. తన పెట్ డాగ్ ఫోటోని షేర్ చేస్తూ.. ‘డౌన్ నాట్ ఔట్’ అని రాసుకొచ్చింది. దీనిపై కొంతమంది రకరకాలుగా స్పందిస్తున్నారు. కానీ మొత్తానికి సామ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే.. తెలుగుతో పాటు హిందీలోను వరుస సినిమాలకు కమిట్ అవుతోంది సమంత. అలాగే వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది.
ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’, ‘యశోద’, ‘ఖుషి’.. సినిమాల్లో నటిస్తోంది. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ఇందులో వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తున్నారు. ‘సిటాడెల్’కు రీమేక్‌గా రానున్న ఈ సిరీస్‌ను.. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్, డీకే రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌లో సమంత ‘రా’ ఏజెంట్‌గా కనిపించబోతుందట. దాంతో సామ్ ఇందులో భారీ యాక్షన్ స్టంట్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే అమెరికాలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని.. రీసెంట్గా తిరిగి ఇండియాకొచ్చిందని టాక్. ఇక ఈ వెబ్ సిరీస్ 1990 బ్యాక్ డ్రాప్లో ఉండబోతుందట. అందుకే సమంత, వరుణ్ ధావన్ వర్క్ షాప్‌లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మరి రా ఏజెంట్‌గా సామ్ ఎలా మెప్పిస్తుందో చూడాలి.