పఠాన్, జవాన్ సినిమాలతో షారుఖ్ ఖాన్‌కు బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్లు ఇచ్చేశారు జనాలు. జవాన్ దెబ్బకు థియేటర్ల దగ్గర మాస్ జాతర జరిగింది. కానీ సల్మాన్ ఖాన్ పరస్థితి మాత్రం మరీ దారుణంగా ఉంది.
Salman Khan: నార్త్‌లో మాత్రమే కాదు.. సౌత్‌లోనూ జవాన్ దుమ్ముదులిపేసింది. అందుకు కారణం.. డైరెక్టర్ అట్లీ, హీరోయిన్ నయనతార, విలన్ విజయ్ సేతుపతినే అని చెప్పాలి. అయినా కూడా.. ఈ మధ్య బాలీవుడ్ నుంచి బడా హీరో సినిమా వస్తుందంటే.. మనోళ్లు కూడా థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా.. సల్మాన్, కత్రీనా జంటగా తెరకెక్కిన టైగర్ 3 రిలీజ్‌కు రెడీ అవుతోంది. అదేం స్ట్రాటజీనో ఏమో గానీ.. టైగర్ 3 సినిమాను ఫ్రైడే కాకుండా.. దీపావళి కానుకగా నవంబర్ 12న, సండే రోజు రిలీజ్ చేస్తున్నారు. దీపావళి రేసులో హిందీ, తెలుగు నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. అయినా కూడా వీకెండ్ మిస్ చేసుకొని.. సెకండ్ వీక్ ఎంట్రీలో టైగర్ 3 రిలీజ్ చేస్తున్నారు. బహుశా దీనివల్లేనేమో.. టైగర్ 3 బుకింగ్స్‌లో జోరు చూపించడం లేదేమో.
పైగా ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. హిందీ బుకింగ్స్ సంగతి పక్కన పెడితే.. సౌత్‌లో మాత్రం సినిమా అడ్వాన్స్ బుకింగ్ వీక్‌గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల విలువైన టికెట్లు అమ్ముడు పోగా.. తమిళనాట కనీసం 50 వేల రూపాయలు కూడా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా నమోదవ్వలేదు. దీంతో.. సల్మాన్ ఖాన్ రేంజ్‌కు ఇది దారుణమైన విషయం అంటున్నారు. పఠాన్, జవాన్ జోష్‌లో టైగర్ 3 మరో వెయ్యి కోట్ల సినిమా అవుతుందని అనుకున్న వాళ్లకు.. ఈ బుకింగ్స్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. టైగర్ 3 సాలిడ్ టాక్ సొంతం చేసుకుంటే తప్పా.. భారీ వసూళ్లు రావని అంటున్నారు.