సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలను పక్కకు పెట్టి.. ప్రజెంట్ వెకేషన్స్‌తో ఎంజాయ్ చేస్తోంది అమ్మడు. అలాగే గ్లామర్ ట్రీట్ కూడా గట్టిగానే ఇస్తోంది. ఇక ఇప్పుడు మరోసారి ఐటెం సాంగ్‌కు సై అన్నట్టుగా తెలుస్తోంది.
Samantha: ఈ మధ్య కాస్త సైలెంట్ అయింది గానీ.. సమంత అంటేనే ఓ సెన్సేషన్, ఓ హాట్ బాంబ్. అందుకే.. మళ్లీ ఈ బ్యూటీ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. అమ్మడి హాట్ హాట్ ఫోట్ షూట్‌కు అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ లేకుండా హాట్ హాట్‌గా దర్శనమిస్తూనే ఉంది. కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పుడు మరోసారి సమంత ఐటెం సాంగ్‌కు సై అనేసినట్టుగా తెలుస్తోంది. గతంలో పుష్ప పార్ట్ వన్‌లో ఐటెం సాంగ్‌తో రచ్చ రచ్చ చేసింది సమంత. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత.. ఈ సాంగ్‌లో రెచ్చిపోయింది హాట్ బ్యూటీ. ఆ తర్వాత యశోద, శాకుంతలం వంటి లేడీ ఓరియేంటేడ్ సినిమాలతో అలరించింది. కానీ మళ్లీ మయోసైటిస్ వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం తగ్గేదేలే అంటోంది. ఈ క్రమంలోనే.. తాజాగా పుష్పరాజ్‌కు మరోసారి ఓకె చెప్పిందనే న్యూస్ వైరల్‌గా మారింది.
పుష్ప2 ఐటెం సాంగ్ కోసం ఎంతో మంది స్టార్స్ హీరోయిన్స్‌తో చర్చలు జరిపాడట సుకుమార్. ఎవ్వరు కూడా వర్కౌట్ కానట్టుగా తెలుస్తోంది. దీంతో.. మళ్లీ సమంతను రంగంలోకి దించాలని భావిస్తున్నాడట సుక్కు. కేవలం ఐటం సాంగ్ మాత్రమే కాకుండా.. కొన్ని సీన్స్‌లో సామ్ కనిపించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇందులో నిజముందో లేదో తెలియదు గానీ.. పుష్ప2లో సామ్ నటిస్తే మాత్రం.. మరోసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవడం గ్యారెంటీ అంటున్నారు. వచ్చే ఏడాది ఆగష్టు 15న పుష్ప2 మూవీ రిలీజ్ కాబోతోంది. సమంత విషయంలో క్లారిటీ రావాలంటే.. మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.