»5 Crore Gift Before The Release Animal Is A Sensation
‘Animal’: రిలీజ్‌కు ముందే 5 కోట్ల గిఫ్ట్? ‘యానిమల్’ ఓ సెన్సేషన్!
డిసెంబర్ 1న అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇక ఇప్పుడు రిలీజ్‌కు ముందే ఐదు కోట్ల గిఫ్ట్ అందుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
5 crore gift before the release? 'Animal' is a sensation!
‘Animal’: అర్జున్ రెడ్డి తర్వాత ‘రా’ డైరెక్టర్ సందీప్ రెడ్డి చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘యానిమల్’. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే యానిమల్ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోయింది. ఈ సినిమాలో అసలు సిసలైన వైలెన్స్ అంటే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు సందీప్. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ,టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
రెండు సాంగ్స్‌లో లిప్ లాక్‌తో రెచ్చిపోయారు రణ్‌బీర్, రష్మిక. సినిమాలో మరింత బోల్డ్ సీన్ ఉంటాయని బాలీవుడ్ వర్గాల సమాచారం. మొత్తంగా.. యానిమల్ పై బీ టౌన్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఖచ్చితంగా ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు. అందుకే.. సినిమా రిలీజ్‌కు ముందే సందీప్‌కు 5 కోట్ల విలువ చేసే కారు గిఫ్ట్‌గా ఇచ్చారనే న్యూస్ వైరల్‌గా మారింది. మామూలుగా అయితే.. సినిమా హిట్ అయితే డైరెక్టర్లకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తుంటారు నిర్మాతలు. సినిమా విడుదలకు ముందే ఐదు కోట్ల కారును బహుమతిగా ఇచ్చాడట నిర్మాత భూషణ్ కుమార్. ఇప్పటికే యానిమల్ బిజినెస్ గట్టిగా జరిగి.. మంచి లాభాలు తెచ్చిపెట్టిందట. అందుకే.. సినిమా మీద పూర్తి నమ్మకంతో ముందే సందీప్‌కు లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్టు సమాచారం. ఏదేమైనా.. సినిమా రిలీజ్‌కు ముందే సందీప్ ఇంత కాస్ట్లీ గిఫ్ట్ అందుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.