»Salman Khan Bought A New High End Bullet Proof Suv
Salman Khan: కొత్త బుల్లెట్ ప్రూఫ్ SUV కొన్న సల్మాన్..బెదిరింపులే కారణమా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇప్పుడు కొత్త బుల్లెట్ ప్రూఫ్(Nissan bullet proof SUV) వాహనాన్ని కొనుగోలు చేశాడు. నిస్సాన్ పెట్రోల్ SUVని ఫారెన్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల పలువురు గ్యాంగ్ స్టర్లు సల్మాన్ ఖాన్ ను చంపుతామని బెదిరించిన నేపథ్యంలో ఈ SUVని తీసుకున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) ఇటీవల తన రాబోయే చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ పాటల విడుదలతో వార్తల్లో నిలిచాడు. కానీ ఈ నటుడు తన కొత్త కారును కొనుగోలు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. సల్మాన్ కొత్త నిస్సాన్(Nissan) బుల్లెట్ ప్రూఫ్ పెట్రోల్ SUVని కొనుగోలు చేశాడు. ఈ కారు అదనపు భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్‌గా తయారుచేయబడినట్లు తెలిసింది. అయితే ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో నటుడు తన కొత్త SUVలో కనిపించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే సల్మాన్ ఖాన్ గ్యారేజ్‌లోని కార్లను బుల్లెట్‌ప్రూఫ్ క్వాలిటీలతో అప్‌గ్రేడ్ చేశారు. అయితే కొంత మంది వ్యక్తుల నుంచి పలుమార్లు మరణ బెదిరింపుల నేపథ్యంలో ఈ SUVని సల్మాన్ కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కొత్త నిస్సాన్ పెట్రోల్ SUV సల్మాన్ ఖాన్ గతంలో కలిగి ఉన్న టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC200కి ప్రత్యామ్నాయం అని పలువురు అంటున్నారు. అయితే జపనీస్ వాహన తయారీదారు అయిన నిస్సాన్ ఇలాంటి భారీ SUVని భారతీయ మార్కెట్లో రిలీజ్ చేయలేదు. ఈ క్రమంలో ఈ కారు వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్నారని ఇంకొంత మంది చెబుతున్నారు. నిస్సాన్ పెట్రోల్ SUV 5.6-లీటర్ V8 పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. ఇది 405 hp, 560 Nm గరిష్ట టార్క్‌ని ఇస్తుంది. 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌకర్యం కల్గి ఉంది.
మరోవైపు నిస్సాన్‌తో పాటు సల్మాన్ ఖాన్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ లాంగ్-వీల్‌బేస్‌ను కూడా కలిగి ఉన్నాడు. దీని ధర సుమారు రూ.1.87 కోట్లు (ఎక్స్-షోరూమ్). 3.0-లీటర్ V6 డీజిల్ ఇంజన్‌తో గరిష్టంగా 4,000 rpm వద్ద 254 bhp అవుట్‌పుట్, 2,250 rpm వద్ద 600 Nm గరిష్ట టార్క్ కల్గి ఉంది. మరోవైపు ఆడి RS7ని కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు సుజుకి హయబుసా సహా పలు వాహనాలు అతని దగ్గర ఉన్నాయి.