ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆదిపురుష్ సినిమాల విషయంలో ఎటు తెల్చుకోలేకపోతున్నారు అభిమానులు. మేకర్స్ ప్రకటించిన ప్రకారం.. ముందుగా ఆదిపురుష్ థియేటర్లోకి రానుంది. కానీ ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పై నమ్మకం లేదంటున్నారు కొందరు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమాను రెండు, మూడు సార్లు వాయిదా వేశాడు. ఇక టీజర్ దెబ్బకు ఆరు నెలలు వెనక్కి వెళ్లాడు. అది కూడా సలార్ రిలీజ్‌కు దగ్గరగా ఆదిపురుష్‌ను తీసుకెళ్లాడు. జూన్ 16న ఆదిపురుష్.. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కానున్నాయి. పాన్ ఇండియా స్టార్ నుంచి ఇంత తక్కువ గ్యాప్‌లో సినిమాలు రావడం కష్టమంటున్నారు. అందుకే సలార్ మరోసారి పోస్ట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ ఈ మధ్యలో ఆదిపురుష్‌ను 2024లో వాయిదా వేసే ఛాన్స్ ఉందని సోషల్ మీడియా టాక్. ఇక ఇప్పుడు ఆదిపురుష్ కాదు.. సలార్‌ను 2024కి తీసుకెళ్తున్నారనే టాక్ నడుస్తోంది. దాంతో ఏది నిజమో, ఏది పుకారో అర్థం కావట్లేదంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇంత జరుగుతున్నా మేకర్స్ మాత్రం స్పందించడం లేదు. దాంతో ఫ్యాన్స్ డైలామాలో పడిపోయారు. కానీ ఆదిపురుష్ కంటే సలార్ మూవీనే ముందుగా థియేటర్లోకి వస్తే బాగుంటుందని అంటున్నారు. కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను భారీ యాక్షన్ డ్రామగా తెరకెక్కిస్తున్నాడు. పైగా సాహో, రాధే శ్యామ్ సినిమాలతో ప్రభాస్ డిసప్పాయింట్ చేశాడు. అందుకే ముందుగా సలార్ రిలీజ్ అయితే.. ప్రభాస్ ఖాతాలో సాలిడ్ హిట్ పడడం ఖాయమంటున్నారు. అయితే ఏ సినిమా ముందొచ్చినా.. ప్రభాస్ నుంచి సినిమా రావాలంటే మరో 7, 8 నెలలు వెయిట్ చేయాల్సిందే.