ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘సలార్’ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు డార్లింగ్ అభిమానులు. అందుకే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. తాజాగా ఓ న్యూస్ వైరల్‌గా మారింది. సలార్ అఫీషియల్ అప్డేట్ వచ్చి చాలా రోజులే అవుతోంది. రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి మరో అప్డేట్ రాలేదు. అయితే సలార్ నిర్మాత, హోంబలే అధినేత విజయ్ కిరగందూర్ చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా 85 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలిపాడు. ఈ నేపథ్యంలో.. సలార్ నుంచి సాలిడ్ అప్టేడ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి లీక్డ్ పిక్స్తోనే సరిపెట్టున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే వచ్చే సంక్రాంతికి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే టీజర్ రిలీజ్ చేస్తారా.. లేదంటే మళ్లీ పోస్టర్‌తోనే సరిపెడతారా.. అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదే నిజమైతే.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి కంటే.. ఇదే అసలైన పండగని చెప్పొచ్చు. ఇకపోతే.. సలార్ మూవీని సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. మళయాళ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ విలన్‌గా నటిస్తున్నాడు. కెజియఫ్ నిర్మించిన హోంబలే సంస్థ ఈ సినిమాను 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. మరి భారీ అంచనాలున్న సలార్ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.