డిసెంబర్ 22న షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) డంకీ సినిమాకు పోటీగా సలార్ రాబోతుందని రీసెంట్గా సాలిడ్ పోస్టర్‌తో అనౌన్స్ చేశాడు ప్రశాంత్ నీల్(Prashanth Neil). అప్పటి నుంచి డంకీ వర్సెస్ డైనోసర్ వార్ మొదలైపోయింది. షారుఖ్ ఫ్యాన్స్ సలార్ సినిమాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా(Social media)లో కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లకు ప్రభాస్ ఫ్యాన్స్ (Prabhas fans) దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తున్నారు. డార్లింగ్ దెబ్బకు డంకీ పోస్ట్‌పోన్ అవనుందనే టాక్ కూడా నడుస్తోంది. కానీ కొందరు షారుఖ్ ఫ్యాన్స్ మాత్రం సలార్ (Salar) రీమేక్ సినిమా.. అని ప్రచారం చేస్తున్నారు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ (Ravi Basrur).. ఉగ్రమ్ ఆధారంగానే సలార్ సినిమా తెరకెక్కుతోందని, కన్నడలో శ్రీమురళి చేసిన పాత్రకు మించి పవర్‌ఫుల్‌గా సలార్‌లో ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి సలార్, ఉగ్రమ్ రీమేక్ అనే టాక్ నడుస్తోంది. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం సలార్ రీమేక్ కాదు.. కొత్త స్క్రిప్ట్‌తో తెరకెక్కిస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు. అయినా కూడా.. ఇప్పుడు కావాలనే కొందరు సలార్, ఉగ్రమ్ రీమేక్ అని ప్రచారం చేస్తున్నారు.
ఇక ప్రభాస్ ఫ్యాన్స్.. డంకీ సినిమా (Dunky movie) సౌత్ రీమేక్ అని.. ఆరేళ్ల కిందట దుల్కర్ నటించిన కామ్రేడ్ ఆఫ్ ఆమెరికా సినిమాకు రీమేక్ అని అంటున్నారు. అసలు ఆ సినిమానే హిట్టు కాలేదు.. ఇక ఇప్పుడు డంకీ హిట్టయ్యే ఛాన్సే లేదని కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా సలార్‌కు పోటీగా వస్తే ఆ సునామిలో కొట్టుకుపోతారని.. షారుఖ్ ఫ్యాన్స్‌ను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. అది డంకీ సినిమా కాదు డాంకీ అనే ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి ఫ్యాన్స్‌తో ట్విట్టర్ (Twitter) మోత మోగిపోతోంది. మరి ఇప్పుడే ఇలా ఉంటే.. సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్ వార్ ఇంకెలా ఉంటుందో చూడాలి.