ఎప్పటికప్పుడు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ చర్చ జరుగుతునే ఉంది.. రాజమౌళి మైండ్‌లో నిజంగానే ఆర్ఆర్ఆర్2 ఐడియా ఉందా.. ఒకవేళ ఉంటే ఎప్పుడుంటుంది.. అసలు ఉంటుందా.. అనే సందేహాలెన్నో ఉన్నాయి. ఇలాంటి సమయంలో సీక్వెల్ గురించి హిట్ ఇచ్చేశాడు జక్కన్న. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన రాజమౌళి.. ఈ సారి ఆస్కార్ రేసులో నిలవడం ఖాయమంటున్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్లో.. అప్ కమింగ్ ఫిల్మ్‌తో పాటు పలు విశేషాలను పంచుకుంటున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు ప్రాజెక్ట్ గురించి పలు విషయాలను షేర్ చేసుకున్నాడు జక్కన్న. తాజాగా తనను హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టిన ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి.. ఓ ఇంటారక్షన్‌లో క్రేజీ అప్టేట్ ఇచ్చాడు. గతంలో ఈ సినిమా సీక్వెల్ చర్చ జరిగినా.. మరోసారి రాజమౌళి నోట ఆ మాట రావడంతో ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆ పనిలో ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఆర్ఆర్ఆర్ పార్ట్ 2 కోసం కొన్ని ఐడియాలు అనుకున్నాం.. అందులో ఒక ఐడియాను డెవలప్ చేస్తున్నామని చెప్పారు. అయితే ప్రస్తుతానికి అది స్క్రిప్టింగ్ స్టేజ్‌లోనే ఉందని చెప్పారు.. అది విజయవంతంగా పూర్తి అయితే అప్పుడు సీక్వెల్ గురించి మాట్లాడతాని చెప్పాడు రాజమౌళి. నిజమే మరి.. జక్కన్న ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేయడం చాలా కష్టం. మహేష్ బాబు సినిమా కంప్లీట్ అవడానికే రెండు, మూడేళ్లు పడుతుంది.. కాబట్టి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఇప్పట్లో కష్టమేనని చెప్పొచ్చు.