Siddharth TAKKAR Movie Review: టక్కర్ ఫుల్ మూవీ రివ్యూ
హీరో సిద్దార్థ్ టక్కర్ మూవీ ఈ రోజు విడుదలైంది. హీరో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తాడు. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం ఏం చేశాడు..? హీరోయిన్‌తో ఎందుకు విడిపోయారనేదే కథ. మూవీ డివైడ్ టాక్ తెచ్చుకుంది.
Siddharth TAKKAR Movie Review: సిద్దార్థ్ (Siddharth) టక్కర్ (TAKKAR) మూవీ ఈ రోజు విడుదలైంది. మూవీలో దివ్యాంశ సిద్దూకు జోడిగా నటించారు. హీరో సిద్దార్థ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం ఏం చేశాడు..? హీరోయిన్‌తో ఎందుకు విడిపోయారనేదే కథ. మూవీ ఫస్ట్ హాఫ్ ఫర్లేదు అనిపించినా.. సెకండాఫ్ కాస్త బోరింగ్‌గా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.
సినిమా: టక్కర్ నటీనటులు:సిద్దార్థ్, దివ్యాంశ, అభిమన్యు సింగ్, యోగిబాబు, మునిష్కాంత్ సినిమాటోగ్రఫీ: వాంచినాథన్ మురుగేషన్ సంగీతం: నివాస్ కే ప్రసాద్ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం: కార్తీక్ జి క్రిష్ విడుదల తేదీ: 09 జూన్
కథ:
కొత్త కథాంశంతో సిద్దార్థ్ (Siddharth) మూవీ తీశాడు. సిద్దార్థ్ అంటే రొమాంటిక్ హీరో, సాప్ట్ క్యారెక్టర్ అని మనకు తెలుసు.. టక్కర్‌లో మాస్ హీరో రోల్.. అలాగే రొమాన్స్ తక్కువేం లేదు. టక్కర్ తమిళ్‌తోపాటు తెలుగులో ఈ రోజు రిలీజ్ చేశారు. హీరో మిడిల్ క్లాస్ అబ్బాయి కాగా.. డబ్బున్న యువతి (దివ్యాంశ)తో ప్రేమలో పడతాడు. హ్యుమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సినిమా సాగుతుంది. తనకు డబ్బు సంపాదన ముఖ్యం అని హీరో అనుకుంటాడు. హీరోయిన్ను కూడా కిడ్నాప్ చేసి తీసుకొని రావాలని మాఫియా ముఠా ఆఫర్ చేస్తోంది. ఊహించినంత డబ్బు ఇస్తానని చెప్పడంతో.. హీరో ఏం చేశాడనే నేపథ్యంలో కథ సాగుతోంది.
ఎలా సాగిందంటే..
డబ్బు సంపాదన కోసం హ్యుమన్ ట్రాఫికింగ్ చేస్తాడు హీరో. ఆ క్రమంలో హీరోయిన్‌తో ప్రేమలో పడతారు. వారి మధ్య వచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఇంటర్వెల్‌కు ముందు ఓ ట్విస్ట్ కూడా ఇచ్చారు. సెకండాఫ్ నెరేషన్ మాత్రం బోరింగ్ ఉందట. కథకు సంబంధం లేదన్నట్టుగా ప్రజెన్స్ చేశారట. విలన్ రోల్ కన్విన్సింగ్‌గా లేదని.. రొమాంటిక్ సీన్లు సమయానికి అనుగుణంగా ఉండవని ప్రేక్షకులు అంటున్నారు.
ఎవరెలా చేశారంటే..?
సిద్ధార్థ్ చేయాల్సిన సినిమా ఇదీ కాదట. సిద్దార్థ్ అంటే బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాలు గుర్తొస్తాయి. టక్కర్ మాత్రం మాస్ మసాలా సినిమా. డిఫరెంట్ జోనర్ అని.. సిద్దార్థ్ నటన ఆకట్టుకోలేక పోయింది. హీరోయిన్ దివ్యాంశ ఫర్లేదు. వీరిద్దరూ రొమాన్స్ డోస్ ఎక్కువ అయ్యిందట. యోగిబాబు కామెడీ మూవీకి కాస్త ప్లస్ అయ్యింది.
సాంకేతిక విభాగాల పనితీరు
నివాస్ కే ప్రసన్న మ్యూజిక్ సినిమాకు హైప్ తీసుకురాలేదు. ఒక పాట మినహా మిగతా సాంగ్స్ ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా యావరేజిగా ఉందట. సినిమాటోగ్రఫీ ఫర్లేదు అనిపించింది. కార్తీక్ జి క్రిష్ కథ ప్రేక్షుకుడిని అంతగా మెప్పించలేదు.