Sushmitha Sen: రిపోర్టుల్లో అంతా బానే ఉంది.. కానీ స్ట్రోక్ వచ్చింది
రెగ్యులర్‌గా చేయించుకునే రిపోర్టుల్లో నార్మల్‌గానే ఉన్నాయని.. తనకు గుండెపోటు వచ్చిందని బాలీవుడ్ నటి సుష్మితా సేన్ వివరించారు. సుష్మిత నటించిన ఆర్య-3 వెబ్ సిరీస్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Sushmitha Sen: కరోనా తర్వాత చాలామందికి స్ట్రోక్ వస్తోంది. గుండెపోటు వచ్చి చనిపోయిన ప్రముఖులు కూడా ఉన్నారు. కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్, ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ విధంగా కన్నుమూశారు. బాలీవుడ్ నటి సుష్మితా సేన్‌కు (Sushmitha Sen) కూడా స్ట్రోక్ వచ్చింది. దీంతో వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేశారు. ఆమె ఏడాదికి రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించుకుంటారు. ఎకో కార్డియోగ్రామ్ టెస్ట్ కూడా బాగానే వచ్చింది. మిగతా రిపోర్టుల్లో అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. తర్వాత స్ట్రోక్ వచ్చింది. ఇదే విషయాన్ని మీడియాతో పంచుకున్నారు.
స్ట్రోక్ ఎందుకు వచ్చిందంటే..?
తనకు ఎందుకు స్ట్రోక్ వచ్చిందో తర్వాత తెలిసిందని వివరించారు. పేరంట్స్కు గుండె సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. జన్యుపరంగా కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని.. అలా వచ్చి ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులకు హృదయ సంబంధ సమస్య ఉండటంతో 6 నెలలకు ఓ సారి వైద్య పరీక్షలు చేయించుకుంటానని చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చిలో కూడా అలా టెస్ట్ చేయించుకోగా.. ఏమీ ప్రాబ్లమ్ లేదని వైద్యులు చెప్పారని వెల్లడించారు.
ఆర్య-3
సుష్మిత సేన్ మెయిన్ రోల్ పోషించిన ఆర్య-3 ఈ రోజు నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వెబ్ సిరీస్ చేస్తోన్న సమయంలో సుష్మితకు స్ట్రోక్ వచ్చింది. ఆర్య ట్రైలర్లో చూపించిన యాక్షన్ సీన్ తనకి గుండెపోటు వచ్చిన నెల తర్వాత తీశారని గుర్తుచేశారు. ఆ ట్రైలర్లో బుల్లెట్ తగలడంతో కిందపడి ఊపిరి తీయడానికి ఇబ్బంది పడే సీన్ ఉందని.. నిజ జీవితంలో కూడా గుండెపోటు రావడంతో ఇబ్బంది పడ్డానని గుర్తుచేశారు.
ఇలా చేయండి..
అలా తనకు గుండెపోటు వచ్చిన విషయాన్ని మీడియాకు వివరించారు. అందుకే ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. హెల్తీ ఫుడ్ తీసుకోవాలని.. కంటి నిండా నిద్రపోవాలని కోరుతున్నారు.