సిద్దిపేట జిల్లా (Siddipet District) హుస్నాబాద్‌లో విషాదం జరిగింది. కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నీ(KMR Cricket Tournament) లో అపశృతి చోటు చేసుకుంది.కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నీ లో క్రికెట్ టొర్నీలో బౌలింగ్ చేస్తున్న క్రమంలో హార్ట్ స్ట్రోక్ (Heart stroke) తో శనిగరం అంజనేయులు (Anjaneyulu) అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
సిద్దిపేట జిల్లా (Siddipet District) హుస్నాబాద్‌లో విషాదం జరిగింది. కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నీ(KMR Cricket Tournament) లో అపశృతి చోటు చేసుకుంది. కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నీ లో క్రికెట్ టొర్నీలో బౌలింగ్ చేస్తున్న క్రమంలో హార్ట్ స్ట్రోక్ (Heart stroke) తో శనిగరం అంజనేయులు (Anjaneyulu) అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్దానికులు గుండెపోటుగా అనుమానంతో సీపీఆర్ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో హుటాహుటినా ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించారు. డాక్టర్స్ చికిత్స చేసిన ప్రయోజనం దక్కలేదు. దీంతో యువకుడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు(Doctors) నిర్ధారించారు. మృతుడు కరీంనగర్ జిల్లా(Karimnagar District) చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్నేహితులు, క్రీడాకారుల్లో (Among sportsmen) విషాదం నెలకొని ఉంది. గుండెపోటుతో మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు చూపరులను కన్నీళ్లు పెట్టించాయి. ఈ మధ్య కాలంలో గుండెపోటు కారణంగా చనిపోయే వారి సంఖ్య ఎక్కువవుతోంది. వ్యాయామం చేస్తూ.. నడుస్తూ హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. కూర్చుని మాట్లాడుతుండగానే ప్రాణాలు గాల్లో కలిసి పోతున్న పరిస్థితి నెలకొంది. ఇక క్రికెట్ ఆడుతూ (Playing cricket) గుండెపోటుకు గురై చనిపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గుండెపోటు పదం వినగానే ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.