దక్షిణాది స్టార్ హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు. త్రిష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. అసలు హీరోయిన్ గా ఇంతకాలం రాణించడం అంటే మామూలు విషయం కాదు. కానీ త్రిష ఇప్పటికీ హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంటోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే కాదు. హీరోల సరసన నటించే ఛాన్స్ కూడా దక్కించుకుంటోంది. అయితే ఈ అమ్మడి పెళ్లి గురించి మళ్లీ వార్తలు రాగా..ఆమె గట్టి కౌంటర్ ఇచ్చింది.
త్రిషకి వయసు పెరుగుతూ ఉంటే, ఆమె అందం కూడా పెరుగుతోంది. రోజు రోజుకీ త్రిషలో పెరుగుతున్న గ్లామర్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా రోజు రోజుకీ పెరుగుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ లో ఆమె అందం చూసి అందరూ షాకైపోయారు. యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఆమె తన గ్లామర్ ని మొయింటైన్ చేస్తున్నారు.
అయితే ఎప్పటికప్పుడు త్రిష(Trisha) పెళ్లి టాపిక్ ఎప్పటికప్పుడు వార్తల్లోకి వస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితం ఆమె ఓ వ్యాపారవేత్తను పెళ్లాడాలని అనుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. కానీ పెళ్లిదాకా వెళ్లలేదు. కాగా తాజాగా మరోసారి త్రిష పెళ్లి వార్తలు గుప్పుమంటున్నాయి. ఆమె ఓ నిర్మాతను పెళ్లాడాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. కాగా ఆ పెళ్లి వార్తలపై తాజాగా త్రిష ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ నేపథ్యంలో తాజాగా త్రిష రియాక్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో వేదిక(ఎక్స్-ట్విట్టర్) ద్వారా ఆమె పెళ్లి రూమర్స్ కి సమాధానం చెప్పకనే చెప్పింది. అయితే ఇందులో చాలా స్ట్రాంగ్‌గా ఆమె ఆన్సర్ ఇవ్వడం విశేషం. కూల్‌గా పోస్ట్ తో మంట పెట్టేంతటి పని చేసింది. మీ వెనక ఉన్నది ఎవరో తెలుసంటూ ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఆమె ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఇందులో త్రిష చెబుతూ మీరు మీతోపాటు ఉన్న మీ టీమ్ ఎవరో మీకు తెలుసు. కూల్(cool)గా ఉండండి. ఇంతటితో ఈ పుకార్లని ఆపేయండి. చీర్స్` అంటూ త్రిష పోస్ట్ పెట్టింది. కొందరు మీతో ఈ పుకార్ పుట్టించారని, అది ఎవరో మీకు తెలుసు అని, ఎందుకు చేశారో తెలుసని ఆమె పరోక్షంగా రూమర్ క్రియేట్ చేసిన వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. దీంతో ఆ పెళ్లి వార్తలో నిజం లేదని ఆమె చెప్పకనే చెప్పింది.