»Parineeti Chopra And Raghav Chadhas Wedding Venue All Lit Up See Night View
Parineeti Chopra: పరిణితి, రాఘవ్ చద్దా పెళ్లి సంబరాలు షురూ!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది పరిణితీ చోప్రా. ఆ తర్వాత వరస అవకాశాలు చేజిక్కించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ బ్యూటీ కొంతకాలంగా వరుసగా వార్తల్లోకి ఎక్కుతోంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.
Parineeti Chopra And Raghav Chadha's Wedding Venue All Lit Up See Night View
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణితీ చోప్రా(Parineeti Chopra) కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే వీరిద్దరూ డిన్నర్ డేట్స్, లంచ్ డేట్స్ కి వెళ్తు కెమెరామెన్ లకు చిక్కారు. ఇంకేముంది ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో, వీరిద్దరి ప్రేమ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. రీసెంట్ గా వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక వీరు పెళ్లికి రెడీ అవుతున్నారు. ఈ జంట సెప్టెంబర్ 24న పెళ్లి చేసుకోనుంది. ఈ జంట రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోనున్నారు. ఈ రోజు వేదికపైకి వెళ్లనున్నారు. ఈ జంట వారి కుటుంబ సభ్యుల కోసం ఉదయపూర్ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
అంతేకాకుండా పెళ్లి వేదిక అంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా(Raghav Chadha) వివాహ వేడుకలు ది తాజ్ లేక్ ప్యాలెస్, ది లీలా ప్యాలెస్‌లో జరుగుతాయి. వారి పెళ్లి జరగనున్న వేదికకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఢిల్లీలో అర్దాస్ వేడుకతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సంగీత సూఫీ రాత్రి జరిగింది. అతిథుల జాబితాలో ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా ఉన్నారు. ఆమెతో పాటు ఆమె కుమారుడు సిద్ధార్థ్ చోప్రా కూడా ఉన్నారు. అతిథుల జాబితాలో క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఉన్నాడు.