మాస్ మహారాజాతో నేషనల్ క్రష్ రష్మిక రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతుందా? అంటే ఔననే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కొత్త కాంబినేషన్ న్యూస్ వైరల్గా మారింది. ఇంతకీ ఈ మాస్ కాంబో ఏ సినిమా కోసం..?
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఎవరంటే.. రష్మిక మందన్న అనే చెప్పాలి. అమ్మడి క్యూట్నెస్కు ఛలో సినిమా నుంచే కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. తాజాగా ఈ బ్యూటీ మాస్ మహారాజాతో రొమాన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే దసరా సందర్భంగా అక్టోబర్ 20న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వర రావు’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు రవితేజ. ఆ తర్వాత సంక్రాంతికి ‘ఈగల్’గా రాబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత హిట్ కాంబో రిపీట్ అవుతోంది. డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ.
వీరసింహారెడ్డి సక్సెస్ జోష్లో గోపీచంద్ చేస్తున్న ఈ సినిమాను.. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఈ సినిమాలోనే హీరోయిన్గా రష్మిక ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల మేకర్స్ రష్మికను సంప్రదించి.. స్టోరీ కూడా నరేట్ చేసినట్టు తెలుస్తోంది. అమ్మడు కూడా ఈ సినిమాకు ఓకె చెప్పినట్టు సమాచారం. ఇప్పటి వరకు రవితేజ, రష్మిక మందన్నా కలిసి నటించలేదు.
దీంతో ఈ మాస్ కాంబో చాలా కొత్తగా ఉంటుందని చెప్పొచ్చు. పైగా, రష్మికకు నార్త్ ఇండియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’.. అల్లు అర్జున్, సుకుమార్ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’తో పాటు ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. కాబట్టి.. మాస్ రాజాతో రష్మిక రొమాన్స్ చేస్తే అదిరిపోతుంది.