కన్నడ బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉంది. అమ్మడికి బడా బడా ఆఫర్లొస్తున్నాయి. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ.. ఓ చెంప దెబ్బ విషయంలో మాత్రం తెగ ఏడ్చేసిందట.
Rashmika Mandanna: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది రష్మిక మందన్న. ప్రస్తుతం అమ్మడి చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా మారిపోయిన రష్మిక.. ప్రజెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’లో నటిస్తోంది. అలాగే ‘రెయిన్బో’ అనే లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ చేస్తోంది. రీసెంట్గా ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే మరో లేడీ ఓరియేంటేడ్ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టింది. శేఖర్ కమ్ముల, ధనుష్ సినిమాలోను నటిస్తోంది. చివరగా యానిమల్తో సాలిడ్ హిట్ కొట్టిన రష్మిక.. ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలకు మోస్ట్ వాంటేడ్ హీరోయిన్గా మారిపోయింది. అయితే అనిమల్ మూవీలో ఓ సీన్లో రష్మిక ఏడ్చేసిందట.
ఓ సీన్లో రణబీర్ కపూర్‌ను చెంపదెబ్బ కొట్టిన రష్మిక.. ఆ సన్నివేశం పూర్తయిన తర్వాత ఏడ్చేశానని ఓ ఇంటర్య్వూలో తెలిపింది. అనిమల్ మూవీలో రణ్విజయ్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించగా అతని భార్యగా గీతాంజలి పాత్రలో రష్మిక నటించింది. దీంతో జోయాతో సెక్స్ చేశాడని తెలిసిన తర్వాత వచ్చే రణ్‌బీర్‌ను చెంపదెబ్బ కొడుతుంది రష్మిక. దీంతో.. ఈ సీన్ చేసిన తర్వాత తాను చాలా ఏడ్చానని, గట్టిగట్టిగా అరిచానని చెప్పుకొచ్చింది. ‘ఆ సీక్వెన్స్ మొత్తం ఒకే టేక్‌లో చేశాం.. కానీ నేనేం చేయబోతున్నానో కూడా నాకు తెలియని పరిస్థితి అది.
అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఎలా ఫీలవుతారో అలాగే ఫీలవ్వాలని సందీప్ చెప్పాడు. అది మాత్రమే గుర్తుంది. యాక్షన్, కట్కు మధ్య ఇంకేమీ గుర్తు లేదు. అసలేం జరిగిందో తెలియదు.. ఈ సినిమాలో ఈ సీక్వెన్స్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నేనే ఆశ్చర్యపోయాను.. అని రష్మిక చెప్పింది. ప్రస్తుతం రష్మిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.