»Ranbir Kapoors Animal Created A Record In Advance Booking
Animal record: సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన యానిమల్
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా యానిమల్ రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా రణబీర్ కపూర్ కెరియర్లో హైయెస్ట్ అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్స్‌లో రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో కూడా టికెట్లు అద్భుతంగా అమ్ముడవుతున్నాయి.
Ranbir Kapoor's Animal created a record in advance booking
Animal record: బాలీవుడ్ మిల్క్ బాయ్ రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటిస్తున్న తాజా చిత్రం యానిమల్(Animal ). ఈ సినిమా అతని కెరియర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తమిళం, తెలుగులో థియేటర్లలో విడుదలకు సిద్ధం అయింది. ఈ సందర్భంగా Sacnilk.com అనే వెబ్సైట్ తాజాగా ఓ నివేదిక వెలువరించింది. యానిమల్ అడ్వాన్స్ బుకింగ్‌లలో ఇప్పటికే ₹9.75 కోట్లు సంపాదించిందని తెలిపింది.
యానిమల్(Animal ) మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. భారతదేశంలోని 7,200 షోలలో 3,34,173 టిక్కెట్లు అమ్ముడయ్యాయని Sacnilk.com తాజా నివేదిక పేర్కొంది. ఇది భారతదేశంలోని అన్ని థియేటర్లో, అన్ని భాషల్లో అడ్వాన్స్ టిక్కెట్ విక్రయాల మొత్తం ₹9.75 కోట్లకు చేరుకుంది. తెలుగు వెర్షన్ ₹91.48 లక్షల వ్యాపారం చేసింది. 643 షోలకు 58,465 టిక్కెట్లను విక్రయించిందని నివేదికలో పేర్కొంది. హైదరాబాద్‌లో జరిగిన యానిమల్ ప్రమోషనల్ ఈవెంట్లో మహేష్‌బాబు(Maheshbabu) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రణబీర్ కపూర్‌కు వీరాభిమానిని, భారతదేశంలో అత్యుత్తమ నటుడు అని అన్నారు. అలాగే ట్రైలర్ చూస్తే మెంటల్ వచ్చేసిందని తెలిపారు. తండ్రి కొడుకుల ఎమోషనల్ డ్రామాతో ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు.