ఓ బడా హీరో పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయితే చాలు.. టికెట్ రేట్లు గట్టిగా పెరిగిపోతాయ్. ఇప్పుడు యానిమల్ విషయంలోనూ అదే జరుగుతోంది. ముఖ్యంగా రెండు నగరాల్లో షాక్ ఇచ్చేలా ఉన్నాయి యానిమల్ టికెట్ ధరలు.
‘Animal’: అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ (‘Animal) మూవీ డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లోకి రాబోతోంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక (rashmika) జంటగా నటించిన మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవగా.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తెలుగులోనూ ఈ సినిమాకు గట్టి డిమాండ్ ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే యానిమల్ సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. పైగా లేటెస్ట్గా జరిగిన ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, మహేష్ బాబు ముఖ్య అథితిగా రావడంతో అంచనాలు పెరిగిపోయాయి.
తెలుగులో యానిమల్ టికెట్ రేట్స్ పక్కన పడితే.. నార్త్‌లో మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై లాంటి ప్రాంతాల్లో యానిమల్ సినిమా టికెట్ రేట్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఢిల్లీలో ఒక్క టికెట్‌కి 2500 ఉండగా, ముంబైలో 2 వేల రూపాయలు ఉంది. అంటే ఫ్యామిలీతో కలిసి నలుగురు థియేటర్‌కి వెళ్లి యానిమల్ సినిమాని చూడాలి అంటే.. కనీసం పది వేలు ఖర్చు అవ్వడం గ్యారెంటీ. ఓ సినిమాకు ఈ రేంజ్లో ఖర్చు చేసి సినిమా చూడడం అనేది మామూలు విషయం కాదు. అయినా కూడా యానిమల్ సినిమాకి భారీ డిమాండ్ ఉంది. టికెట్స్ రేట్ ఎంత అనేది పట్టించుకోకుండా.. అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి. ఈ లెక్కన యానిమల్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుకే మెంటల్ ఎక్కింది అని చెప్పుకొచ్చాడు. కాబట్టి.. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా మరో సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అని చెప్పొచ్చు.