టీ20 సిరీస్ ని టీమిండియా గెలుచుకుంది. హైదరాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… టీమ్ ఇండియా క్రికెటర్లకు హీరో రామ్ చరణ్ తేజ్ పసందైన విందు ఇచ్చారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ కోసం భారత జట్టు హైదరాబాద్ రాగా క్రికెటర్లకు రామ్ చరణ్ తన ఇంటికి ఆహ్వానించారు.
మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌తోపాటు మరి కొందరు ఆటగాళ్లు చరణ్ ఇంటికి వెళ్లారు.దీనికి సంబంధించిన పోస్టు వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆటగాళ్లను రామ్ చరణ్ సన్మానించారు. అనంతరం వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు. రామ్ చరణ్ తో పాటు ఆయన సతీమణి ఉపాసనతో పాటు, మెగాస్టార్ కుటుంబ సభ్యులు, పలువురు సినీ నటులు, సెలబ్రిటీలు ఈ పార్టీలో పాల్గొన్నట్టు వార్తలు వస్తున్నాయి.
వీటికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ తన అధికారిక ఖాతాలో త్వరలో షేర్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్ నివాసంలోని ఓ వ్యక్తి హార్దిక్ పాండ్యాతో ఫోటోలు దిగారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.