Ramcharan: దర్శకుడిపై రామ్ చరణ్ అసహనం.. డెడ్‌లైన్ అప్పటి వరకే?
మెగాస్టార్ వారసుడిగా స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న రామ్ చరణ్ ఎంత కూల్‌గా సింపుల్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అలాంటి చరణ్ ఓ స్టార్ దర్శకుడిపై అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు.. డెడ్‌లైన్ టార్గెట్ కూడా పెట్టాడట.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ గేమ్ చేంజర్ విషయంలో మెగా ఫ్యాన్స్ అసలు హ్యాపీగా లేరు. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఎక్కడ కనిపించినా కూడా.. గేమ్ ఛేంజర్ అప్డేట్స్ ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. కానీ ప్రజెంట్ శంకర్ ఫోకస్ మొత్తం ఇండియన్ 2 పైనే ఉంది. అసలు చరణ్ సినిమాలు చేసే స్పీడ్‌కి ఈ పాటికి రెండు సినిమాలు కంప్లీట్ అయి ఉండేవి. కానీ శంకర్ సినిమా కాబట్టి.. ఈ మాత్రం టైం తీసుకుంటున్నాడు చరణ్. అయినా కూడా గేమ్ చేంజర్ షూటింగ్ రోజు రోజుకి డిలే అవుతునే ఉంది.
దీంతో రామ్ చరణ్ కాస్త అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఓపిక పట్టింది చాలు.. అన్నట్టుగా గేమ్ చేంజర్‌కు చరణ్ డెడ్‌లైన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. శంకర్‌తో పాటు దిల్ రాజుకి.. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కంప్లీట్ చేసుకోవాలని చెప్పాడట. ఆ తర్వాత మార్చి నుంచి బుచ్చిబాబు సినిమాను మొదలుపెట్టాలని ఫిక్సయ్యాడట చరణ్. ఇదే విషయాన్నిశంకర్కి క్లియర్ కట్‌గా చెప్పాడట. కానీ శంకర్ మాత్రం ఇండియన్ 2తో ఇరుక్కుపోయాడు.
దీంతో చరణ్ పెట్టిన డెడ్‌లైన్ వరకు శంకర్ గేమ్ చేంజర్‌ను కంప్లీట్ చేస్తాడా? లేదా? అనేది ఎటు తేలకుండా ఉంది. మరోవైపు చరణ్ కోసం బుచ్చిబాబు చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడో స్క్రిప్టు రెడీ చేసుకొని.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. కాస్టింగ్ కూడా దాదాపుగా ఫైనల్ అయిపోయిందట. కానీ గేమ్ చేంజర్ వల్ల కాల్ షీట్స్ ఓకే చేయలేకపోతున్నారట. మరి శంకర్ ఈ సినిమాను ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తాడో చూడాలి.