Game Changer : ఇకపై రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్!
Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. నెక్స్ట్ సాలిడ్ లైనప్ సెట్ చేకున్నాడు. రాజమౌళి తర్వాత మరో టాప్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. గేమ్ చేంజర్‌తో చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహాలు లేదు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. నెక్స్ట్ సాలిడ్ లైనప్ సెట్ చేకున్నాడు. రాజమౌళి తర్వాత మరో టాప్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. గేమ్ చేంజర్‌తో చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహాలు లేదు. సినిమా రిజల్ట్ పక్కన పెడితే.. యాక్టింగ్ పరంగా శంకర్, చరణ్‌ను మరో మెట్టుకి తీసుకెళ్లడం ఖాయం. ఈ సినిమాలో చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. తండ్రి కొడుకుగా నటిస్తున్నాడు. ఇక గేమ్ చేంజర్ తర్వాత.. బుచ్చిబాబుతో ఆర్సీ 16 చేస్తున్నాడు. డైరెక్టర్‌కు రెండో సినిమానే అయినా.. ఇది మరో రంగస్థలం అంటున్నాడు చరణ్. ఖచ్చితంగా ఈ సినిమా తన కెరీర్లో స్పెషల్‌గా నిలుస్తుందని అంటున్నాడు. ఆ తర్వాత కొంతమంది క్రేజీ డైరెక్టర్స్ చరణ్‌తో టచ్‌లో ఉన్నారు. యూవీ క్రియేషన్స్‌లో కన్నడ డైరెక్టర్ నర్తన్‌తో ఓ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. ఇక సుకుమార్ ఇప్పటికే ఇంట్రో సీన్ కూడా షూట్ చేసేశాడు. కాబట్టి ఎప్పుడైనా ఈ కాంబో నుంచి అనౌన్స్మెంట్ రావొచ్చు. మరో వైపు యంగ్ టాలెంట్ లోకేష్ కనగరాజ్ చాలా రోజులుగా చరణ్‌తో ట్రావెల్ అవుతున్నాడు. ఈయినతో ఇప్పుడు కాకపోయినా.. ఖచ్చితంగా సినిమా మాత్రం ఉంటుంది. ఇవే కాదు ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాడు చరణ్. ఇప్పటికే.. మొత్తం ఆరు సినిమాలకు సైన్ చేసినట్టు ఆస్కార్ ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చాడు చరణ్. అన్నట్టు ప్రశాంత్ నీల్ కూడా చరణ్‌తో లైన్లో ఉన్నాడు. కాబట్టి.. ఇకపై చరణ్ క్రేజ్ అండ్ ఆయన సినిమాలు నెక్స్ట్ లెవల్ అనేలా ఉండబోతున్నాయి.