Rajini: తలైవా రజనీకాంత్ (Rajinikanth) మనవడు, హీరో ధనుష్ (dhanush) కుమారుడు యాత్రకు తమిళనాడు పోలీసులు జరిమానా విధించారు. ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ దంపతుల పెద్ద కుమారుడు యాత్ర అనే సంగతి తెలిసిందే. కొద్దిరోజుల కింద యాత్ర స్పోర్ట్స్ బైక్పై రయ్యిమని దూసుకెళ్లాడు. ఆ సమయంలో అతని హెల్మెట్ లేదు.
యాత్ర వెళుతుండగా ఒకరు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు చూశారు. బైక్ నంబర్ ఆధారంగా హీరో ధనుష్ (dhanush) బైక్ అని గుర్తించారు. బైక్ నడిపిన అతని కుమారుడు యాత్రకు వెయ్యి రూపాయాల ఫైన్ వేశారు. ఇప్పుడు ఈ వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రజనీకాంత్ కూతురు ఐశ్వర్య-ధనుష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.. యాత్ర పెద్ద కుమారుడు. ధనుష్-ఐశ్వర్య మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. పిల్లల కోసం అప్పుడప్పుడూ కలుస్తారు. వారిద్దరు విడిపోకుండా ఉండేందుకు రజనీకాంత్ ప్రయత్నించారు. కానీ కలిసి ఉండేందుకు ఇద్దరూ అంగీకరించలేదు.