»Rajamouli Has Inspired To Make Ponniyin Selvan Two Parts
Ponniyin Selvan రెండు భాగాలు.. అదే స్ఫూర్తి అంటోన్న మణిరత్నం
పొన్నియన్ సెల్వన్-2 మూవీ ప్రమోషన్లో దర్శకుడు మణిరత్నం బిజీగా ఉన్నారు. సినిమా రెండు పార్టులుగా తీయడానికి బాహుబలి స్ఫూర్తి అని.. జక్కన్న రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.
Rajamouli has inspired to make Ponniyin Selvan two parts
Mani ratnam:మరో 4 రోజుల్లో పొన్నియన్ సెల్వన్-2 మూవీ (ponniyin selvan) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ మూవీ యూనిట్ ప్రమోషన్లో బిజీగా ఉంది. హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకుడు మణిరత్నం (mani ratnam).. ఐశ్వర్య రాయ్ (aishwarya rai), జయం రవి (jayam ravi), కార్తీ (kaarthi), త్రిష (trisha) పాల్గొన్నారు. పొన్నియన్ సెల్వన్ మూవీ గురించి రెండు భాగాలుగా తీయడానికి గల కారణం వివరించారు మణిరత్నం.
నిజానికి తనకు మూవీ రెండు పార్టులుగా తీసే ఉద్దేశం లేదని చెప్పారు. జక్కన్న రాజమౌళి (rajamouli) బాహుబలిని రెండు భాగాలుగా తీయడంతో రెండు పార్టులుగా మలిచానని తెలిపారు. రాజమౌళి తీయకుంటే.. తాను కూడా తెరకెక్కించే వాడిని కాదెమోనని తెలియజేశారు. రాజమౌళికి మణిరత్నం (mani ratnam) కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పుడే కాదు ఇదివరకు ఈ విషయం చెప్పానని.. రాజమౌళితో (rajamouli) కూడా ఈ మాట అన్నానని మణిరత్నం (mani ratnam) వివరించారు. బాహుబలి సినిమా స్ఫూర్తితో పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలుగా తెరకెక్కించానని తెలిపారు. రాజమౌళి (rajamouli) వేసిన బాటలో అందరూ వెళ్తున్నారని మణిరత్నం (mani ratnam) ప్రశంసలు కురిపించారు. సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా రాజమౌళి (rajamouli) కృషి చేశారని కొనియాడారు.
చారిత్రాత్మక సినిమాలు చేసేందుకు కావాల్సిన నమ్మకం.. బాహుబలి ద్వారా ఇండస్ట్రీకి కలిగించిందని తెలిపారు. భారతీయ చరిత్రను సినిమాలుగా మలిచేందుకు రాజమౌళి (rajamouli) చాలా మంది దర్శక, నిర్మాతలకు మార్గం సుగమం చేశారని పేర్కొన్నారు. జక్కన్న రాజమౌళిని (rajamouli) దిగ్గజ దర్శకుడు మణిరత్నం కొనియాడటం విశేషం. సినిమా ప్రమోషన్ అయినప్పటికీ.. ప్రశంసలు కురిపించడం చర్చకు దారితీసింది.