బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి.. ఆర్ఆర్ఆర్తో హాలీవుడ్‌ను అట్రాక్ట్ చేశాడు. అందుకే ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ స్క్రిప్టు దశలోనే ఉంది. త్వరలోనే అన్ని విషయాలు తెలియనున్నాయి. అయితే స్క్రిప్టుతో పాటు మిగతా అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు జక్కన్న. అందులోభాగంగా ఓ హాలీవుడ్ ఏజెన్సీ సంస్థతో భారీ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ లీడింగ్ ‘క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ’తో ఒప్పందం చేసుకున్నట్టు ఓ న్యూస్ ట్రెండ్ అవుతోంది. సీఏఏ ఏజెన్సీ లాస్ ఏంజెల్స్ కేంద్రంగా టాలెంట్ హంట్‌గా పని చేస్తోంది. ఈ ఏజెన్సీ సినిమాల ఎండార్స్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్తోపాటు డైరెక్టర్స్, నటీనటులకు ప్రాతినిథ్యం వహిస్తుంది. హాలీవుడ్లో ఉన్న ఎందరో నటీ నటులు ఈ ఏజెన్సీ నుంచే వచ్చిన వారే ఉన్నారు. అలాంటి సంస్థతో జక్కన్న డీల్ చేసుకోవడం.. ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. నిజంగానే రాజమౌళి ‘సీఎఎ’తో డీల్ చేసుకుంటే మాత్రం.. నెక్ట్స్ సినిమాతో పాటు మన హీరోలను ప్రప్రంచ వ్యాప్తంగా ప్రమోట్ చేయడం పక్కా అని అంటున్నారు. అలాగే రాజమౌళి నెక్స్ట్ సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించే ఛాన్స్ ఉంది. అయితే ఈ మాసివ్ డీల్ మహేష్ బాబు సినిమా కోసమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో మహేష్‌ను పాన్ ఇండియా హీరో కాదు.. ఏకంగా గ్లోబల్ స్టార్‌గా మార్చడమే దర్శక ధీరుడు టార్గెట్ అని చెప్పొచ్చు. ఏదేమైనా టాలీవుడ్‌కు జక్కన్న హాలీవుడ్ డీల్ మరింత బూస్టింగ్ ఇస్తోంది.