SSRajamouli: మేడ్ ఇన్ ఇండియా..రాజమౌళి భారీ ప్రాజెక్ట్ అనౌన్స్!
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అందుకుని హిస్టరీ క్రియేట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) నుంచి భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ వచ్చేసింది. టైటిల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే రాజమౌళి ఈ సినిమాకు దర్శకుడు కాదు.
బాహుబలి అనే సినిమా లేకపోయి ఉంటే..ఈ రోజు పాన్ ఇండియా, పాన్ వరల్డ్, తెలుగు సినిమాకు ఆస్కార్, బెస్ట్ యాక్టర్ అనేవి ఉండేవి కావు. ఐదారేళ్లు ఎంతో కష్టపడి బాహుబలి సినిమాను తెరకెక్కించి..పాన్ ఇండియన్ సినిమాకు పునాది వేశాడు జక్కన్న. బాహుబలి తర్వాత యావత్ ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేశాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అందుకుని చరిత్ర సృష్టించాడు. రీసెంట్గా అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నాడంటే..అది పాన్ ఇండియా వల్లేనని చెప్పొచ్చు.
ఇక రాజమౌళి సినిమా అయితే చాలు.. బాక్సాఫీస్ దగ్గర ఈజీగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ వస్తాయి. ఇండియన్ డైరెక్టర్స్‌లో ఏ దర్శకుడికి కూడా ఈ రేంజ్ ఇమేజ్ లేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కిస్తున్నాడు. కానీ ఈ లోపే భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే టైటిల్‌తో పాన్ ఇండియా సినిమా ప్రకటించాడు. అయితే ఇది రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా కాదు. రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్న సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్.
‘ఇండియన్ సినిమా బయోపిక్’గా ఈ మూవీ తెరకెక్కుతోంది. అసలు ఇండియన్ సినిమా ఎక్కడ పుట్టింది? దాని ఆరిజిన్ ఏంటి? అనే కథతో ఈ సినిమా రూపొందుతోంది. నితిన్ కక్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని రాజమౌళి కొడుకు కార్తికేయ, వరుణ్ గుప్తా కలిస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. యమదొంగ సినిమాని తన సొంత బ్యానర్ విశ్వామిత్ర క్రియేషన్స్ పై ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన రాజమౌళి.. ఆ తర్వాత మళ్లీ ప్రొడిక్షన్ వైపు వెళ్లలేదు. అయితే ఈ మధ్య బాలీవుడ్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాని తెలుగులో రిలీజ్ చేశాడు రాజమౌళి. ఇక ఇప్పుడు ‘మేడ్ ఇన్ ఇండియా(MadeInIndia)‘ సినిమాను ప్రజెంట్ చేస్తున్నాడు.