»Nick Jonas And Malti Marie Chopra In Printed Blue Outfits Are Are The Best Fashionista Duo In Town
Priyanka Chopra: తన భర్త పుట్టిన రోజు సందర్భంగా కూతురు ఫోటోలను షేర్ చేసిన ప్రియాంక చోప్రా
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తన భర్త, అమెరికన్ పాప్‌స్టార్ నిక్ జోనాస్ పుట్టినరోజు సందర్భంగా అతని ఫోటోలను పంచుకున్నారు. సెప్టెంబర్ 16న నిక్ 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
Priyanka Chopra: ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తన భర్త, అమెరికన్ పాప్‌స్టార్ నిక్ జోనాస్ పుట్టినరోజు సందర్భంగా అతని ఫోటోలను పంచుకున్నారు. సెప్టెంబర్ 16న నిక్ 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రియాంక పలు ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఒకదానిలో ఆమె నిక్ని అతని బుగ్గలపై ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. రెండవ ఫోటోలో గోల్ఫ్ ఆడుతున్నప్పుడు నిక్ సోలో షాట్ చేస్తున్నాడు. మరో ఫోటోలో కూతురు మాల్తీ మేరీ కూడా కనిపిస్తోంది.
ప్రియాంక చోప్రా క్యాప్షన్‌లో, ‘నేను నా జీవితంలో అత్యంత ఉత్తేజకరమైన విషయాన్ని జరుపుకుంటున్నాను’ అని రాశారు. నిక్, అది జీవితంలో నిజంగా సాధ్యమేనా అన్న సందేహంలో ఉన్నప్పుడు నువ్వు చేయగలవని నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపిన వ్యక్తి నిక్. నేను ఇంతకు ముందెన్నడూ అనుభవించని శాంతిని నిన్ను కనుగొన్న తర్వాత అనుభవించాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ మై బర్త్ డే గై, నీ కలలన్నీ ఎప్పటికీ నెరవేరాలని ఆశిస్తున్నాను, పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని పోస్ట్‌లో ప్రియాంక ‘స్వర్గం’ లొకేషన్‌ను ట్యాగ్ చేసింది. ఇది తను పెళ్లి చేసుకుని ఎంత ఆనందంగా ఉందో తెలుపుతుంది. ఆమె స్టేడియం షో నుండి ఫోటోను కూడా షేర్ చేసింది. ఇందులో ఆమె కటౌట్ డ్రెస్ వేసుకుని జోనాస్ వైపు చూస్తోంది. అతను ‘ఇన్క్రెడిబుల్ వీకెండ్’ అనే క్యాప్షన్‌లో రాశాడు. ప్రియాంక, నిక్ 2018లో వివాహం చేసుకున్నారు.