Chakri: దాదాపు 9 నెలల నుంచే కెమెరాల ముందు యాక్టింగ్ చేయడం వలన అసలు భయం అనేది లేదని, డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే నా ముందు నటుడు తప్ప ఎవరు కనిపించరు, అందుకే చాలా హుషారుగా నటిస్తా అంటున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి. ఎన్నో సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బాలనటుడు అనేక సినిమా ముచ్చట్లను హిట్ టీవీతో పంచుకున్నారు. తనకు ఇష్టమైన సినిమాలు చాలా ఉన్నా మహార్షి, త్రిబుల్ ఆర్ సినిమాలలో బాగా చేశావు అని ప్రేక్షకులు చెబుతారని చెప్పారు. ఇంతవరకు ఏ యాక్టింగ్ స్కూల్ కు వెళ్లలేదని తెలిపారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఓ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే దర్శకుడు సుకుమార్ తనకు చాలా పెద్ద ఆఫర్ ఇచ్చాడని చెప్పాడు.
భాగ్ సాలే సినిమా షూటింగ్ టైమ్ లో చాలా ఫీవర్ వచ్చిందని కానీ అలానే సీన్ కంప్లీట్ చేశానని చెప్పాడు. ఇక సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమో, సెట్ లో చేసే అల్లరి గురించి, తాను ఏ విధంగా డైలాగ్స్ ప్రిపేర్ అవుతారో లాంటి ఎన్నో విషయాలను వివరించారు. చక్రీ గురించి మరిన్ని ఆసక్తి కరమైన విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూసేయండి.