ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ బాక్సాఫీస్ దగ్గర సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ముఖ్యంగా ‘పుష్ప’ సాంగ్స్ బన్నీ మేనరిజమ్స్, డైలాగ్స్.. సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 450 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి.. బన్నీ కెరీర్లో సరికొత్త రికార్డుని సృష్టించింది. అయితే ఈ మూవీ విడుదలై ఏడాదైపోయింది. అయినా సీక్వెల్‌ను మొదలు పెట్టలేదు సుకుమార్. కానీ పుష్పని మించి పుష్ప2ని తెరకెక్కించబోతున్నాడు. అందుకోసం మైత్రీ మూవీ మేకర్స్ 350 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేయబోతున్నారు. అయితే ఎట్టకేలకు పుష్ప2 సందడి మొదలైపోయినట్టేనని తెలుస్తోంది. ఇటీవలె ఐదు రోజులు షూటింగ్ చేసి.. బ్రేక్ ఇచ్చాడు సుకుమార్. అయితే ఇప్పుడు రెగ్యూలర్ షూటింగ్ టైం వచ్చేసినట్టేనని అంటున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. జనవరి 7 నుంచి పుష్ప2 షూటింగ్లో జాయిన్ అవబోతున్నాడట బన్నీ. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో షూటింగ్ ప్రారంభం కానుందట. రేపో మాపో దీనిపై క్లారిటీ రానుందని అంటున్నారు. ఇకపోతే.. ప్రస్తుతం పుష్ప సినిమా రష్యాలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అక్కడ మంచి కలెక్షన్లో దూసుకుపోతున్నట్టు చెబుతున్నారు మేకర్స్. ఇక రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. మళయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు.