డబుల్ ఇస్మార్ట్ సెట్స్ నుంచి ఓ ఫోటోను మేకర్స్ పంచుకున్నారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో రామ్ పోతీనేని కలిసున్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
Puri Jagannath and Ram Pothineni are chilling in DoubleISMART sets
DoubleISMART: టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni), డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్(Double iSmart). వీరిద్దరి కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో అభిమానులకు చాలా ఆసక్తి నెలకొంది. చాలా రోజులుగా ఈ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్‌ను అలరించడానికి మేకర్స్ ఓ పిక్ రిలీజ్ చేశారు. హీరో రామ్, డైరెక్టర్ పూరీ సెట్స్‌లో సరదాగా మాట్లాడుకునే పిక్ అది.
గెట్ రెడీ అంటూ ఈ పిక్‌తో పాటు పూరీ కనెక్ట్స్ ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ముంబైలో డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ జరుగుతుంది. దీనికోసం ఏకంగా రూ. 7 కోట్లు ఖర్చు చేస్తున్నారని టాక్ నడుస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం జూన్ 14న పాన్ ఇండియా చిత్రంగా విడుదల అవుతుంది. రామ్ పోతినేని స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పిక్ వైరల్ కావడంతో రామ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.