Aswini dutt: లాభాలు వచ్చినా పొంగిపోలేదు.. అశ్వినీదత్ ఎమోషనల్
వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఎన్నో భారీ సినిమాలను నిర్మించారు. ఇప్పుడు ఆయన కూతుళ్లు నిర్మాతలుగా మారి మరిన్ని హిట్ సినిమాలు అందిస్తున్నారు. వారి బ్యానర్ పై వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఇప్పుడు వారి బ్యానర్ నుంచి వస్తున్న మరో సినిమా అన్నీ మంచి శకునములే.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఎన్నో భారీ సినిమాలను నిర్మించారు. ఇప్పుడు ఆయన కూతుళ్లు నిర్మాతలుగా మారి మరిన్ని హిట్ సినిమాలు అందిస్తున్నారు. వారి బ్యానర్ పై వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఇప్పుడు వారి బ్యానర్ నుంచి వస్తున్న మరో సినిమా అన్నీ మంచి శకునములే. ఈ సినిమా ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అశ్వనీదత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ‘మొదటి నుంచి కూడా నాకు రాఘవేంద్రరావుగారితో .. అల్లు అరవింద్ తో మంచి స్నేహం ఉంది. మా బ్యానర్ల నుంచి వచ్చిన భారీ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. మేము ముగ్గురం కూడా ఎన్నో సక్సెస్ లను చూశాము’అన్నారు.
‘నేను .. అల్లు అరవింద్ గారు కలిసి రాఘవేంద్రరావుగారితో 1996లో ‘పెళ్లి సందడి’ సినిమాను నిర్మించాము. కోటి 20 లక్షల రూపాయలతో నిర్మించిన ఆ సినిమా, 14 కోట్లను వసూలు చేసింది. ఆ సినిమాకి డిస్ట్రిబ్యూటర్లం కూడా మేమే. మంచిగా లాభాలను పంచుకున్నాము. అన్ని కోట్ల రూపాయల లాభాలు వచ్చినప్పుడు కూడా మేము ఎగిరిపడలేదు. ఆ తరువాత నేను అల్లు అరవింద్ గారు కలిసి హిందీలో ఒక సినిమాను నిర్మించాము. అప్పుడు అంతకంటే ఎక్కువ పోయింది. అంతగా నష్టాలు వచ్చినా మేము కుంగిపోలేదు. మరో పెగ్గు ఎక్కువ తాగేసి ఎవరి దారిన వాళ్లం పోయాము’ అని పేర్కొన్నారు. ఈ మాటలు మాట్లాడే సమయంలో అశ్వినీదత్ ఎమోషనల్ అవ్వడం గమనార్హం.