Prithvi Daughter Srilu:కమెడీయన్ పృథ్వీ (Prithvi) కూతురు శ్రీలు (Srilu) హీరోయిన్గా తెరంగ్రేటం చేయనుంది. ఆ సినిమాను తండ్రి పృథ్వీ (Prithvi) డైరెక్ట్ చేస్తాడని తెలిసింది. కుమారులను తండ్రులు ఇంట్రొడ్యూస్ చేస్తారు. పృథ్వీ (Prithvi) మాత్రం కూతురుని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయడమే గాక.. తానే దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇదివరకు కమెడీయన్ ఎంఎస్ నారాయణ కూడా కుమారుడితో సినిమా తీసిన సంగతి తెలిసిందే. ‘కొడుకు’ అనే మూవీని తనే డైరెక్ట్ చేయగా.. ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు పృథ్వీ (Prithvi) వంతు వచ్చింది. తన కూతురు శ్రీలును (Srilu) ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఆ సినిమా పేరు ‘కొత్త రంగుల ప్రపంచం’ ఇందులో క్రాంతి అనే అతను హీరోగా చేస్తున్నాడు.
హీరోయిన్ పాత్రకు సరిపోతానని తనను తీసుకున్నాడని.. కూతురు (Srilu) అని మూవీలోకి తీసుకోలేదని శ్రీలు చెప్పారు. నాన్న (Prithvi) మూవీ డైరెక్ట్ చేస్తున్నారనే విషయం తనకు తెలియదని వివరించారు. హీరోగా క్రాంతిని సెలక్ట్ చేశారని.. ఆ తర్వాత తనను ఎంపిక చేశారని పేర్కొన్నారు. మూవీ తర్వాత నాన్న ప్రతిభ ఏంటో తెలుస్తోందని అంటున్నారు.
నాన్నను ఎంతో ఇష్టపడతా.. ఆయన చేసే పాత్రలను ఎంజాయ్ చేశానని తెలిపారు. నాన్న చేసే రాజకీయం మాత్రం నచ్చదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. పాలిటిక్స్ వద్దని చెప్పలేనని.. అందుకు కారణం ఆయనకు ఇంట్రెస్ట్ ఉండటమే కారణం అంటున్నారు. ఇండస్ట్రీలో ముందు వెనుక చాలా జరుగుతుంటాయి.. అవేమీ పట్టించుకోవద్దని.. పని చేసుకో అని నాన్న తనకు సలహా ఇచ్చారని వివరించారు. తనకు నాన్న పృథ్వీ (Prithvi) స్ఫూర్తి అని తెలిపారు.