ప్రస్తుతం ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందుకు తగ్గట్టే.. ఆ బ్యూటీ కూడా పలు సందర్భాల్లో ప్రభాస్ పై అమితమైన ప్రేమను చూపిస్తోంది. ఆమె ఇంకెవరో కాదు.. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న కృతి సనన్.
ఇటీవల ఈ ముద్దుగుమ్మ ప్రభాస్‌తో పెళ్లికి సిద్దమని.. ఓపెన్‌గానే స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే పలు ఇంటర్య్వూల్లో ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే గత రెండు, మూడు రోజుల నుంచి బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్.. కృతి సనన్ గురించి చెప్పిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందులో ఇండైరెక్ట్‌గా.. కృతి మనసులో ఓ హీరో ఉన్నాడని చెప్పాడు.
అయితే స్టార్టింగ్‌లో ఇదేదో క్యాజువల్‌గా చెప్పాడని అనుకున్నారు. కానీ వరుణ్ ధావన్ చెప్పిన దాని ప్రకారం.. కృతితో ప్రభాస్ నిజంగానే ప్రేమలో ఉన్నాడా.. అనే సందేహాలు వెలువడుతున్నాయి. ‘భేడియా’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్, కృతి ఓ ఇంటర్య్వూకి హాజరయ్యారు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. ‘కృతి మనసులో ఒక హీరో ఉన్నాడు..
అతను ఇప్పుడు ముంబైలో లేడు.. కానీ దీపికా పదుకునేతో షూటింగ్లో ఉన్నాడు’ అని అన్నాడు. ఇందులో ప్రభాస్ పేరు చెప్పకపోయినా.. కృతి మనసులో ఉన్నది ప్రభాసేనని అంటున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే.. ప్రస్తుతం దీపికతో కలిసి నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’లో నటిస్తున్నాడు ప్రభాస్. దాంతో వరుణ్ చెప్పింది ప్రభాస్ గురించేనని అంటున్నారు. మరి.. ప్రభాస్ నిజంగానే కృతితో ప్రేమలో ఉన్నాడా.. అంటే ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు నెటిజన్స్.