ప్రభాస్ నటించిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా ప్రభాస్‌ను శ్రీరాముడిగా చూసేందుకు వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆదిపురుష్ ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయలేదు.. కానీ టీజర్ మాత్రం లోడింగ్ అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ టీజర్‌ను సీఎం చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ‘ఆదిపురుష్’ చిత్రం తమ సక్సెస్ దాహాన్ని తీరుస్తుందని గట్టిగా నమ్ముతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అందుకే జనవరి 12 కోసం రోజులు లెక్కపెడుతున్నారు. అయితే ఈ లోపు ఏదైనా అప్డేట్ ఇవ్వండని పట్టుబడుతున్నారు. కానీ మేకర్స్ మాత్రం పట్టించుకోవడం లేదు.
అయితే దసరాకు ఆదిపురుష్ టీజర్ లాంచింగ్‌కు ప్లాన్ చేస్తున్నారని తెలియడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ మళ్లీ హోల్డ్‌లో పెట్టారని డిసప్పాయింట్ అవుతున్నారు. దాంతో ఆదిపురుష్ టీజర్ సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. అయితే ఇప్పుడు మళ్లీ టీజర్ రాబోతోందనే వార్తలు ఊపందుకున్నాయి. అది కూడా సీఎం చేతుల మీదుగా లాంచ్ కాబోతోందని తెలుస్తోంది. అయోధ్యలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ చేతుల మీదుగా భారీ ఎత్తున ఆదిపురుష్ టీజర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అంతకంటే ముందే సెప్టెంబర్ 26న ఫస్ట్ లుక్ కూడా రానుందని టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియదు గానీ.. ఆదిపురుష్ టీజర్ పై రోజుకో వార్త పుట్టుకొస్తునే ఉంది. అయినా చిత్ర యూనిట్ మాత్రం స్పందించడం లేదు. మరి ఆదిపురుష్ టీజర్ అసలు కథేంటో వాళ్లకే తెలియాలి.