Posani Krishna Murali : పుస్తకాల్లో కత్తి పెట్టుకొని తిరిగిన పోసాని!
పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. సినీ, రాజకీయ పరంగా పోసాని ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని ఇటీవలె పదవిని చేపట్టారు.
పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. సినీ, రాజకీయ పరంగా పోసాని ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. సినిమాల్లో రైటర్(Movie writer) గా అనేక సినిమాలకు పనిచేశారు. దాదాపుగా 150కి పైగా సినిమాలకు రచయితగా ఉన్నారు. అలాగే దర్శకుడిగా మారి పలు సినిమాలను తెరకెక్కించాడు.
ఇప్పుడుండే స్టార్ డైరెక్టర్లు అయిన బోయపాటి శ్రీను(Boyapati srinu), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) వంటివారు పోసాని శిష్యులే. నిర్మాతగా కూడా మారి పోసాని(Posani) పలు సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నారు. ఇకపోతే రాజకీయం(Political)గానూ బలంగా ఉన్నారు. పాలిటిక్స్ లో పోసాని ఎప్పటి నుంచో యాక్టీవ్ గా ఉన్నారు.
తాజాగా పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)కి ఏపీ సర్కార్ పోస్ట్ కూడా ఇచ్చింది. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని ఇటీవలె పదవిని చేపట్టారు. తాజాగా పోసాని ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలిపారు. తన క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి తన పెళ్లి జరగకుండా కొందరు పనిగట్టుకుని చేశారని పోసాని(Posani Krishna Murali) ఫైర్ అయ్యారు. తన పెళ్లి చెడగొట్టిన వారు ఎవరో తనకు తెలుసని, వాళ్లు చేసే పనులకు విసిగిపోయి వాళ్లను చంపడానికి పుస్తకాల్లో కత్తి పెట్టుకుని తిరిగినట్లు పోసాని చెప్పుకొచ్చారు. పోసాని చెప్పిన ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.