Manchu Manoj: దయచేసి ఆ న్యూస్ నమ్మకండి.. మంచు మనోజ్
మంచు మనోజ్ సినిమా న్యూస్ కన్నా వ్యక్తిగతమైన విషయాల్లో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తన కుటుంబంపై వస్తున్న ఓ వార్తను కొట్టిపడేశారు. అభిమానులు దాన్ని నమ్మొద్దు అని తెలిపారు.
Manchu Manoj: మంచు మనోజ్ గురించి అందరికి తెలిసిందే. హీరోగా చాలా సినిమాలు చేశాడు. తరువా పెళ్లి విడాకులు, మళ్లీ పెళ్లి చేసుకొని ఇప్పుడు రియాల్టీ షోలు, సినిమాలు చేస్తూ కెరియర్‌పై ఫోకస్ చేస్తున్నాడు. దాదాపు ఏడాది క్రితం మౌనికకు పెళ్లి చేసుకున్నారు. అయితే తాను తండ్రికాబోతున్నట్లు మనోజ్ అందరికి చెప్పారు. ఆ తరువాత కొన్నాళ్లకు మౌనిక బేబీ బంప్స్ ఫోటోలు కూడా విడుదల చేశారు. తాజాగా మౌనిక కవల పిల్లలకు జన్మనిచ్చింది అని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీని వలన కుటుంబంలో మళ్లీ గొడవలు అవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై మంచు మనోజ్ స్పందించారు.
‘‘మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరంతా మాకు అండగా ఉన్నందుకు మేం సంతోషిస్తున్నాం. నా సతీమణి ఏడో నెల గర్భవతి. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉంది. ఇంకొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రానున్న బిడ్డల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. కవల పిల్లల విషయంలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. సమయం వచ్చినప్పుడు మేమే ఆనందాన్ని మీతో స్వయంగా పంచుకుంటాం. దయచేసి ఇలాంటి న్యూస్‌ను పట్టించుకోవద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.