పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. పవర్ స్టార్ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా అనౌన్స్ అయిన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. కానీ షూటింగ్ మాత్రం జరగడం లేదు. అయితే లేటెస్ట్గా టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Pawan Kalyan fans get ready.. 'Harihara Veeramallu' teaser is coming!
Pawan Kalyan: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో పవన్ నుంచి కొత్త సినిమాల అప్టేడ్స్ ఏవి ఆశించలేం. కానీ మొన్నామధ్య హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేసి పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాడు. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్‌ని హైలెట్ చేస్తూ గ్లింప్స్ కట్ చేశాడు. ఇక.. ఇక్కడి నుంచి పవన్ సినిమాల అప్డేట్స్ ఏవి ఉండవు అనుకున్నారు. ఏదైనా ఉంటే.. ఎలక్షన్స్ తర్వాతే అనుకున్నారు. కానీ ఇప్పుడు శ్రీరామనవమి సందర్బంగా హరిహర వీరమల్లు నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జై శ్రీరామ్.. శ్రీరామనవమి శుభాకాంక్షలతో.. మీ ముందుకు ‘ధర్మం కోసం యుధ్ధం’.. త్వరలోనే హరిహర వీరమల్లు టీజర్ రాబోతోందని అనౌన్స్ చేశారు.
కాకపోతే కొత్త పోస్టర్ ఏది రిలీజ్ చేయకుండా.. పాత పోస్టర్‌తోనే సరిపెట్టారు. కానీ ఈ అప్డేట్తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది పవన్ ఆర్మీ. టీజర్‌ను త్వరగా రిలీజ్ చేయాలని అంటున్నారు. అయితే.. గతంలో కూడా ఇలాంటి అప్డేట్ ఒకటి ఇచ్చారు మేకర్స్. కానీ మళ్లీ టీజర్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మధ్యలో టీజర్ వస్తుందని పవన్ ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు. కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం టీజర్ వచ్చేస్తోందంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈసారైనా పక్కా రిలీజ్ చేస్తారా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇకపోతే.. ఈ సినిమాకు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం, మెగా సూర్య ప్రొడక్షన్ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మరి హరిహర వీరమల్లు టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.