బాలీవుడ్ నటి సన్నీలియోన్ షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఐదారు సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు షూటింగ్ జరుగుతుండగా ఆమె కుడికాలి బొటన వేలికి గాయం అయ్యింది. వేలి నుంచి రక్తం బయటకు రావడంతో అక్కడున్న సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ చేశారు. కాలి వేలికి దెబ్బతగలడమే కాకుండా ఆమె పెదవి కూడా కొద్దిగా చితికినట్లు తెలుస్తోంది. నొప్పిని భరించలేక సన్నిలియోన్ చాలా ఇబ్బంది పడిందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్ర...
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా అనువాద చిత్రాల హావా నడుస్తోంది. ఈ మధ్యకాలంలో రిమేక్ సినిమాలు విజయాలతో దూసుకుపోతున్నాయి. అందుకే అనువాద సినిమాలకు మరింత డిమాండ్ పెరిగింది. తెలుగు, కన్నడ, తమిళంలోని సినిమాలు దాదాపు మూడు భాషల్లో విడుదల అవుతూ వస్తున్నాయి. ఇటీవలె కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘కాంతార’ సినిమా వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తాజాగా ఆ విధంగానే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘వేద̵...
తన అన్నయ్య తనయుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. నా కొడుకు సేఫ్‌గా ఉన్నాడని, వైద్యులకు పాదాభివందనం అన్నారు బాలయ్య. లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తారకరత్నకు మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని గుర్తు చేశారు. అతనికి హార్ట్ బీట్ కూడా ఆగిపోయిందన్నారు. కానీ అద్భుతం జరిగిందని, మళ్లీ కోలుకున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. తాము కుప్పం...
నేచురల్ స్టార్ నాని కొత్త సినిమాను ప్రారంభించాడు. టాలీవుడ్ లో హీరోగా, నిర్మాతగా వరుస హిట్లు అందుకుంటూ నాని దూసుకుపోతున్నాడు. ఈ తరుణంలో తాజాగా తన 30వ సినిమాని ప్రారంభించాడు. ఇటీవల న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీని ప్రకటించిన నాని నేడు పూజ కార్యక్రమాలు చేసి సినిమాకి క్లాప్ కొట్టాడు. ఈ లాంచ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, రైటర్ విజయేంద్ర ప్రసాద్, దర్శకులు హను రాఘవపూడి, బుచ్చిబాబు, నిర్మాత అశ్విని దత్ తో ...
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కి అనేక అవార్డులను గెలుచుకుంటోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. అంతేకాకుండా పలు అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా దక్కాయి. ఆస్కార్ అవార్డుకు కూడా నాటు నాటు పాట నామినేట్ అయ్యి రికార్డు నెలకొల...
హీరో నందమూరి తారకరత్న గుండెపోటుతో బెంగళూరులోని ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. ఏపీ టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారకరత్న పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయాడు. కార్యకర్తలు ఆయన్ని కుప్పం హాస్పిటల్ కు తరలించగా హార్ట్ ఎటాక్ అని తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్ మెంట్ అందించాక మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరులోని నారాయణ హృదయాలయా ఆస్పత్...
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో దూసుకుపోతున్నాడు. దీపికా పదుకొనే హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా చేసిన ఈ సినిమా వసూళ్ల పరంగా మంచి కలెక్షన్లను రాబట్టుతోంది. ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. జనవరి 25వ తేదిన ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. నాలుగేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ తెరపై కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. పఠాన్ సినిమా రిలీజ్ […]
యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగైందని.. చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నాడు అనే వార్తతో తెలుగు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తారకరత్న ఆరోగ్యంపై క్షణ క్షణం ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే. నందమూరి కుటుంబసభ్యులు కూడా తారకరత్న ఆరోగ్యంతో ఉన్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని ప్రకటించారు....
స్టార్ హీరోయిన్ ఇలియానా ఆస్పత్రిలో చేరారు. టాలీవుడ్ లో ఈమె దేవదాస్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నటించి అగ్ర కథానాయికగా పేరు పొందింది. అయితే ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా ఇలియానా ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫోటోలను షేర్ చేసింది. చేతికి సెలైన్ తో ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఇలియానాను చూసి [&hell...
ప్రస్తుతం దేశమంతా పఠాన్ సినిమా గురించే మాట్లాడుకుంటోంది. అసలు పఠాన్ సినిమా ఎన్నో అవాంతరాల మధ్య విడుదల అయినా రోజుకు రూ.100 కోట్లు వసూలు చేస్తూ అందరినీ షాక్ కు గురి చేస్తోంది. బాలీవుడ్ మీద ఇప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నింటినీ పఠాన్ సినిమా బద్దలు కొట్టేసింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో సినిమా యూనిట్ మొత్తం చాలా హ్యాపీగా ఉంది. తాజాగా మూవీ సక్సెస్ [&he...
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బులెటిన్ విడుదలైంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి సోమవారం తాజాగా బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. తారకరత్న ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నాడని వెల్లడించారు. అయితే తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అందిస్తున్నామని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఇప్పటి వరకూ కూడా తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అస...
టాలీవుడ్ హీరోయిన్ గా పూర్ణ ఎంతో పాపులర్ అయ్యింది. ఈమె హీరోయిన్ గా కంటే పలు షోలకు న్యాయనిర్ణేతగా చేసి ఫేమస్ అయ్యింది. తెలుగులో ‘శ్రీ మహాలక్ష్మి’, అవును, సీమటపాకాయ్, అఖండ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బుల్లితెరపై ఢీషోకు న్యాయనిర్ణేతగా చేసింది. గత ఏడాది అక్టోబర్ లో దుబాయ్ కు చెందిన బిజినెస్ మ్యాన్ తో పూర్ణకు వివాహం అయ్యింది. పూర్ణ అసలు పేరు షమ్న ఖాసిమ్. ఈమె పెళ్...
నేచురల్ స్టార్ నాని హీరోగా దసరా అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాల తర్వాత నాని దసరా సినిమా చేస్తున్నాడు. నాని ఇప్పటి వరకూ ఏ సినిమాలో కనిపించని పాత్రలో నటిస్తున్నాడు. 1980 తెలంగాణలోని సింగరేణి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా ఫస్ట్ లుక్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ మధ్యనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను ప్రారంభించారు. తాజాగా నేడు మరో క్రేజీ ప్రాజెక్టును లాంచ్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత అయిన డివివి దానయ్య నిర్మాణంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఆ నిర్మాణ సంస్థ ఇటీవలె ప్రకటించింది. నేడు ఆ మూవీని అఫీషియల్ గా లాంచ్ చేశారు. హైదరాబాద్ అన్న...
భాషపై అభిమానం ఉండవచ్చు.. కానీ మరి మూర్ఖంగా ఉండకూడదు. ఈ విషయం కన్నడ ప్రజలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పది రోజుల వ్యవధిలో సినీ పరిశ్రమకు చెందిన వారిపై కన్నడ ప్రజలు దాడులకు పాల్పడ్డారు. ఇటీవల మంగ్లీపై జరిగిన దాడి మరువక ముందే ఇప్పుడు ప్రముఖ గాయకుడు కైలాశ్ ఖేర్ పై దాడికి పాల్పడ్డారు. కొన్ని రోజుల వ్యవధిలో సినీ ప్రముఖులపై దాడులు చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఇతర భాషలకు చెందిన వారు కర్ణా...