Dasara Movie: ‘దసరా’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్
నేచురల్ స్టార్ నాని(Natural star Nani) ఏ సినిమా తీసినా ఆడియన్స్ నుంచి మంచి ఎంకరేజ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నాని డిఫరెంట్ లుక్స్‌తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. దసరా(Dasara) సినిమాకు సంబంధించి సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది.
నేచురల్ స్టార్ నాని(Natural star Nani) ఏ సినిమా తీసినా ఆడియన్స్ నుంచి మంచి ఎంకరేజ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నాని డిఫరెంట్ లుక్స్‌తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆ లుక్స్ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా తర్వాత ”అంటే సుందరానికి” అనే సినిమా చేశారు. ఆ మూవీ తర్వాత నాని(Nani) చేస్తున్న తాజా సినిమా ‘దసరా'(Dasara). ఎస్ఎల్వి సినిమాస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.
దసరా సినిమా సాంగ్ ప్రోమో:
https://www.youtube.com/watch?v=qsabhSGNYuw&t=27s
మాస్ లుక్కులో నాని(Nani) దసరా సినిమాలో కనిపించనున్నారు. ఈ మూవీలో నానికి జోడీగా కీర్తి సురేశ్(Keerthy suresh) నటిస్తోంది. గతంలో కీర్తి సురేశ్ తో నాని ‘నేను లోకల్’ అనే సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా వీరిద్దరూ రెండో సారి జతకట్టారు. దసరా సినిమాకు సంబంధించి సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో అద్భుతమైన పాటను వినిపించారు. ”ఓరి వారి నీదు గాదుర పోరి..ఇడిసెయ్ రా ఇంగ..ఒడిసెను దారి” అంటూ ఆ పాట సాగుతుంది.
దసరా(Dasara) సినిమాలో హీరో మాట్లాడే భాషకు తగ్గట్టుగానే ఈ పాటలో సాహిత్యం అందించారు. ఫిబ్రవరి 13వ తేదిన దీనికి సంబంధించిన పూర్తి సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది. దసరా(Dasara) సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఈ మూవీని మార్చి 30వ తేదిన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు.