ఫిబ్రవరి 12న ముంబైలో కియారా ఫ్యామిలీ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ రిసెప్షన్ కు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 7న రాజస్థాన్ లోని జైసల్మీర్ లో వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది
SidKiara : బాలీవుడ్ కొత్త జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో రిసెప్షన్ కూడా పూర్తయింది. ఢిల్లీ రిసెప్షన్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ఇవే కావడంతో అవి నెట్టింట్లో అలా చక్కర్లు కొడుతున్నాయి.
ఫిబ్రవరి 12న ముంబైలో కియారా ఫ్యామిలీ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ రిసెప్షన్ కు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 7న రాజస్థాన్ లోని జైసల్మీర్ లో వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి కాగానే ఇద్దరూ సిద్ధార్థ్ ఇంటికి వెళ్లిపోయారు. ఇన్ని రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో రిసెప్షన్ కూడా పూర్తవడంతో ముంబైకి పయనం కానున్నారు.
SidKiara : ఇద్దరిని కలిపిన షేర్షా మూవీ
సిద్ధార్థ్, కియారా అద్వానీని షేర్షా మూవీ కలిపింది. ఈ సినిమా 2021 లో విడుదలైంది. అప్పటి నుంచే వీళ్లు డేటింగ్ లో ఉన్నారు. నిజానికి.. లస్ట్ స్టోరీస్ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ కలిసినప్పటికీ అప్పుడు వీళ్ల మధ్య ప్రేమ చిగురించలేదు. షేర్షాతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి చివరకు అది పెళ్లి బంధానికి బాటలు వేసింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా కియారా ఇటీవల తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇద్దరూ దండలు మార్చుకున్న వీడియోను షేర్ చేయగా.. అందులో ఇద్దరూ లిప్ కిస్ ఇచ్చుకొని దండలు మార్చుకొని వివాహబంధంతో ఒక్కటయ్యారు.