Sreeleela : వామ్మో.. శ్రీలీల ఏంటి ఇలా ఉంది.. వైరల్ అవుతున్న పాత వీడియో
18 ఏళ్ల వయసులోనే తను కిస్ అనే కన్నడ మూవీలో నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కానీ.. తనకు అంతగా గుర్తింపు రాలేదు. కన్నడ సినిమాలు వరుసగా చేసుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత తెలుగులో పెళ్లి సందడి సినిమాలో నటించింది
Sreeleela : శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో తనే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తనకు ఓవర్ నైట్ పాపులారిటీ రాగా.. ధమాకా సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి ముందే కన్నడలో తను కొన్ని సినిమాల్లో నటించింది. కానీ.. ఆ సినిమాలు అంతగా తనకు గుర్తింపునివ్వలేదు.
18 ఏళ్ల వయసులోనే తను కిస్ అనే కన్నడ మూవీలో నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కానీ.. తనకు అంతగా గుర్తింపు రాలేదు. కన్నడ సినిమాలు వరుసగా చేసుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత తెలుగులో పెళ్లి సందడి సినిమాలో నటించింది. దీంతో ఒక్కసారిగా తనకు క్రేజ్ పెరిగింది.
Sreeleela : కిస్ సినిమా షూటింగ్ వీడియో వైరల్
తను కిస్ సినిమా చేసినప్పుడు దానికి సంబంధించిన షూటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో శ్రీలీల అదరగొట్టేసింది. ఫైట్ మాస్టర్ తో ఫైట్ చేస్తూ.. కాలు ఎగరేస్తూ పొట్టి డ్రెస్ వేసుకొని రచ్చ చేసింది. ఆ వీడియోలో చిన్నపిల్లలా కనిపించిన శ్రీలీలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో మూడు సినిమాలు చేస్తోంది. కన్నడలోనూ ఓ సినిమాలో నటిస్తోంది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. బాలయ్య బాబు సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.