Punarnavi: పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు..బిగ్ బాస్ బ్యూటీ ఫైర్
బిగ్ బాస్(Big Boss) షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. అలా పాపులర్ అయిన వారిలో పునర్నవి(Punarnavi) కూడా ఒకరు. బిగ్ బాస్3(Big Boss3) తర్వాత ఈమె పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. పునర్నవి భూపాలం(Punarnavi Bhupalam) తాజాగా ప్రెగ్నెంట్ అయ్యిందనే రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిగ్ బాస్(Big Boss) షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. అలా పాపులర్ అయిన వారిలో పునర్నవి(Punarnavi) కూడా ఒకరు. బిగ్ బాస్3(Big Boss3) తర్వాత ఈమె పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. అప్పట్లో పునర్నవి, రాహుల్ సింప్లిగంజ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి. బిగ్ బాస్3(Big Boss3) షోలో రాహుల్, పునర్నవి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తోంది. తాజాగా పునర్నవి భూపాలం గురించి ఓ షాకింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
పునర్నవి భూపాలం(Punarnavi Bhupalam) తాజాగా ప్రెగ్నెంట్ అయ్యిందనే రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలోనూ తన ‘గే’ ఫ్రెండ్‌తో పునర్నవికి ఎఫైర్ ఉందనే, రీసెంట్ గా ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందనే రూమర్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ రూమర్స్ వార్తలపై తాజాగా పునర్నవి(Punarnavi) ఫైర్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె రియాక్ట్ అయ్యింది.
“ఈ పుకార్లు పూర్తిగా అర్ధం లేనివి. నా ‘గే’ బెస్టీతో నన్ను గర్భవతిని చేయాలని సోషల్ మీడియా నిర్ణయించేసింది. గత నెలలో నేను దాదాపు చచ్చిపోతున్నాను అని అన్నారు. ఈ నెలలో నేను ప్రెగ్నెంట్ అని రాసేశారు. అసలు యూట్యూబ్ స్నేహితులకు మా ఫ్రెండ్ షిప్ గురించి ఏం అర్థమైంది?” అంటూ ఆమె నోట్ రాసింది. ఈ నోట్ లో పునర్నవి(Punarnavi) తెలుగు చలన చిత్ర పరిశ్రమపై కూడా పలు ఆరోపణలు చేసింది.
“తెలుగు ఇండస్ట్రీలో ఇది చాలా ‘షేమ్ కల్చర్’. ఈ మధ్య ఇలాంటి కల్చర్ బాగా పెరిగిపోతుంది. దీన్ని రిపేర్ చేయలేరు. తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి రెండు ముఖాలు ఉన్నాయి. కేవలం కొందరు మహిళలను మాత్రమే తెలుగు ఇండస్ట్రీ గౌరవంగా చూస్తుంది. అయినా మీరు చూసేది అంతా నిజం కాదు. నిజం ఎప్పుడూ త్రీ డైమెన్షనల్. మీరు మీ కళ్లతో చూసేది మీకు నిజం అనిపించవచ్చు. కానీ అదే పూర్తి నిజం కాదు. ఇప్పటికైనా మేల్కోండి.” అంటూ పునర్నవి(Punarnavi) నోట్ రాసుకొచ్చింది. దాంతో పాటుగా పిల్లల్ని కనడంపై కూడా తన ఆలోచనలను ఆమె పంచుకుంది.
“ఇక్కడ నిజం ఏంటంటే నేను ప్రెగ్నెంట్ కాదు. గర్భం ధరించడం అనేది చాలా మంది మహిళలకు ఒక ఎమోషనల్ అంశం. కాబట్టి “మీరు ఎప్పుడు బిడ్డను కనబోతున్నారు? “దయచేసి నేను చచ్చిపోయే లోపు ఓ బిడ్డను కను” లాంటి కండిషన్లు, ప్రశ్నలు ఎవరినీ అడగకండి. నాకు పిల్లలంటే ఇష్టం. కానీ నాకు పిల్లలు వద్దు.” అంటూ ఆమె రియాక్ట్ అయ్యింది.
ప్రస్తుతం పునర్నవి(Punarnavi) యూకేలో ఉంటోంది. గతంలో తన ‘గే’ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న పిక్స్, వీడియోస్ ను షేర్ చేస్తూ ఆమె నోట్ రాసుకొచ్చింది. తన చదువును కొనసాగించేందుకు 2021లో ఆమె లండన్‌కు వెళ్లినట్లు తెలిపింది. పునర్నవి(Punarnavi) ‘ఉయ్యాల జంపాలా’ సినిమాలో అవికా గోర్, రాజ్ తరుణ్‌తో కలిసి మొదటగా నటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్- 3(Big Boss3)తో పాపులర్ అయ్యి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. రాహుల్ సిప్లిగంజ్‌తో పునర్నవికి అప్పట్లో పెద్ద లవ్ ట్రాకే నడిచింది. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి దారిలో వారు బిజీగా ఉన్నారు.