'Adurs' : 'అదుర్స్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్! : ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్31 ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్31 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అయితే తారక్‌ను బిగ్ స్క్రీన్ పై చూడాలంటే మరో ఏడాదికి పైగా ఆగాల్సి ఉంది. ఎన్టీఆర్ 30ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నారు. కానీ రీ రిలీజ్ ట్రెండ్‌లో భాగంగా.. 2023లోను యంగ్ టైగర్‌ను థియేటర్లో చూసి పండగ చేసుకోబోతున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్లో ఎన్ని బ్లాక్బస్టర్లు వచ్చినా.. అదుర్స్ మూవీ మాత్రం ఎంతో స్పెషల్. ఇందులో చారిగా ఇరగదీశాడు ఎన్టీఆర్. ఆయనలోని కామెడీ టైమింగ్ డబుల్ అదుర్స్ అనేలా ఉంటుంది. గురు శిశ్యులుగా బ్రహ్మీ, తారక్ చేసిన కామెడీ.. ఎప్పటికీ హైలెటే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్‌ను భట్టు, చారి లేకుండా చూడడం కష్టం. అందుకే ఈ ఇద్దరు ఎప్పుడు ట్రెండింగ్ టాపికే. 2010లో వివి. వినాయక్ డైరెక్షన్లో వచ్చిన అదుర్స్ మూవీ.. అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 26 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. 89 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై కామెడీ పండిస్తునే ఉంది. అయితే బిగ్ స్క్రీన్ పై భట్టు, చారిల కామెడీ చూస్తే.. ఆ కిక్కే వేరు. అందుకే 13 ఏళ్ల తర్వాత అదుర్స్ మూవీని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 4న ఫోర్ కె ప్రింట్‌తో అదుర్స్ మూవీని రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా స్టార్ అయిపోయాయి. మార్చి ఫస్ట్ వీక్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం.. అదుర్స్‌కు కలిసొచ్చేలా ఉంది. మరి మీరు కూడా.. మరోసారి భట్టు, చారిలను థియేటర్లో చూసి పడి పడి నవ్వుకోండి.