»Brahmanandam Meets Guppedantha Manasu Serial Team
Brahmanandam : గుప్పెడంత మనసు సీరియల్ టీమ్‌ను కలిసిన బ్రహ్మానందం.. ఎందుకంటే? వీడియో
బ్రహ్మానందం ఇటీవల ఏదో షూటింగ్ కోసం ఒక చోటుకు వెళ్లారట. అక్కడే పక్కన గుప్పెడంత మనసు సీరియల్ షూటింగ్ కూడా జరుగుతోందట. దీంతో వెంటనే వెళ్లి ఆ సీరియల్ టీమ్ ను కమెడియన్ అలీతో పాటు కలిశారు బ్రహ్మానందం.
Brahmanandam : గుప్పెడంత మనసు సీరియల్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిషి సార్, వసుధార ఇద్దరూ ప్రేమలో పడటం.. వాళ్ల పెళ్లికి వసుధార నాన్న ఒప్పుకోకపోవడం, మధ్యలో రాజీవ్ రావడం.. అలా ప్రస్తుతం ఈ సీరియల్ కొనసాగుతోంది. ఈ సీరియల్ కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అందులో బ్రహ్మానందం కుటుంబం కూడా ఉంది.
బ్రహ్మానందం ఇటీవల ఏదో షూటింగ్ కోసం ఒక చోటుకు వెళ్లారట. అక్కడే పక్కన గుప్పెడంత మనసు సీరియల్ షూటింగ్ కూడా జరుగుతోందట. దీంతో వెంటనే వెళ్లి ఆ సీరియల్ టీమ్ ను కమెడియన్ అలీతో పాటు కలిశారు బ్రహ్మానందం. ఈసందర్భంగా సీరియల్ గురించి, సీరియల్ లో రిషి, వసుధార, ఇతర నటీనటుల నటన గురించి ప్రత్యేకంగా చెప్పారు. మీ యాక్టింగ్ బాగుంటుందని, సీరియల్ కూడా ఫాలో అవుతుంటా అని సీరియల్ టీమ్ తో చెప్పారు బ్రహ్మానందం.
Brahmanandam : లెజెండరీ యాక్టర్ ను చూసి ఆశ్చర్యపోయిన సీరియల్ టీమ్
బ్రహ్మానందం అంటేనే ఒక లెజండరీ యాక్టర్. ఆయన్ను చూసి సీరియల్ టీమే ఆశ్చర్యపోయింది. అందరితో కలిసి ఆయన కాసేపు సరదాగా గడిపారు. అందరి నటనను మెచ్చుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను ఆ సీరియల్ లో మహీంద్రాగా నటించే సాయికిరణ్ తన యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.