యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన 'డిజే టిల్లు' సినిమాకి సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది.
తమిళంలో విజయవంతమైన 'మండేలా' సినిమాకు తెలుగు రిమేక్‌గా రూపొందించిన చిత్రం 'మార్టిన్ లూథర్ కింగ్'( Martin Luther King ). బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్(Sampoornesh Babu) బాబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఈ రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా రివ్యూ ఏంటో తెలుసుకుందాం.
నెగిటివ్ రివ్యూ ఇచ్చిన 9 మందిపై కేసు నమోదైంది. మలయాళం డైరెక్టర్ ఉబైనీ తాను తీసిన సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చిన 9 మందిపై ఫిర్యాదు చేశాడు. దీంతో రివ్యూ నెగిటివ్‌గా ఇచ్చిన 9 మందిపై కేసు నమోదు కాగా వారికి సంవత్సరం వరకూ శిక్ష పడే అవకాశం ఉంది.
తెలుగు సినిమా చరిత్రకు ఇంతవరకు ఎంత గొప్ప పేరున్నా.. ఆఫ్టర్ రాజమౌళి, బీఫోర్ రాజమౌళి అనే ముద్రవేశారు దర్శకదిగ్గజుడు. ఇన్ని సంవత్సరాలుగా ఆయన రికార్డులను ఆయనే తిరగరాస్తున్నారు కానీ మరే దర్శకుడు రాజమౌళి స్థానాన్ని చేరుకోవడం లేదు. ఇతర ఇండస్ట్రీ దర్శకులు ఆ మార్క్‌ను టచ్ చేస్తున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నవంబర్ 1వ తేదీన ఇటలీలో పెళ్లి జరగనుండగా.. 5వ తేదీన హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై తీస్తోన్న ద రైల్వేమెన్ పార్ట్-1 వచ్చేనెల 18వ తేదీ నుంచి నెట్ ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవనుంది. ఈ మేరకు యూనిట్ డేట్ అనౌన్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది.
హిట్ కాంబో సూర్య, డైరెక్టర్ సుధా కొంగర మళ్లీ కలిసి మరో చిత్రం చేయబోతున్నారు. ఈ చిత్రానికి ప్రస్తుతం సూర్య43 అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే టైటిల్‌లోని కొంత భాగాన్ని అనౌన్స్‌మెంట్ వీడియోలో ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, నజ్రియా సహా కీలక నటీనటులు యాక్ట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్జీవీ ఏదో ఒక పోస్ట్ పెట్టి వైరల్ అవుతూనే ఉంటారు. తాజాగా చంద్రబాబును ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది.
కిర్గిస్థాన్ వేదికగా షాంఘై సహకార సదస్సు జరుగుతుంది. ఈ సమావేశం ప్రారంభం సందర్భంగా మన భారతదేశపు పాటతో మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను భారత విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ వైరల్‌గా మారింది.
తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇటివల నటించిన లియో చిత్రం ఓటీటీ విడుదల తేదీ దాదాపు ఖరారైంది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ తో ఈ మూవీ మేకర్స్ ఒప్పందం కుదుర్చుకోగా స్ట్రీమింగ్ తేదీని కూడా ఫైనల్ చేశారు.
హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సానే ఖాన్ తన పుట్టిన రోజు వేడుకను స్నేహితులు, కుటుంబ సభ్యుల నడుమ ఘనంగా జరుపుకుంది. తన ప్రియడు ఆర్స్లాన్ గోని హాజరు కానప్పటికి సోషల్ మీడియాలో ప్రేమతో కూడిన శుభాకాంక్షలను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌పై హృతిక్ రోషన్ స్పందించడం విశేషం.
హీరో వెంకటేష్ ద్వితీయ కుమార్తె వాహిని నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడితో పెళ్లి ఖాయమైన నేపథ్యంలో నిన్న నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు.