Amala Paul-Jagath Desai: సెలబ్రిటీలు ఏం చేసినా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రేమ, పెళ్లి.. ఏదైనా సరే హాట్ టాపిక్ అవుతుంటుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత.. వారికి సంబంధించిన ఏ ఇన్ఫో అయినా సరే క్షణాల్లో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంటుంది. ఇప్పుడు బ్యూటీ అమలాపాల్ (Amala Paul) మరొకరితో లవ్‌లో పడిందని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుందని తెలిసింది.
చదవండి: Koffeewith Karan8: దీపిక, రణ్వీర్ పెళ్లి వీడియో వైరల్
ప్రేమ పెళ్లి- విడాకులు
అమలాపాల్ (Amala Paul) స్వస్థలం కేరళ.. సో ఆమె కెరీర్ మలయాళ సినిమాలతో ప్రారంభమైంది. తర్వాత తెలుగు, తమిళ మూవీస్ చేశారు. బెజవాడ అనే మూవీతో తెరంగ్రేటం చేశారు. లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండా పై కపిరాజు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పీక్‌గా ఉన్న సమయంలోనే దర్శకుడు ఎఎల్ విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2014లో వీరి పెళ్లి కాగా.. మూడేళ్లు కలిసి ఉన్నారు. 2017లో పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడిపోయారు. తర్వాత విజయ్ మరొకరిని పెళ్లి చేసుకోగా.. అమలాపాల్ ఒంటరిగానే ఉన్నారు.
షికార్లు- ప్రపోజల్
ఆడపా దడపా సినిమాలు, యాడ్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారు అమలాపాల్. ఫ్రెండ్స్‌తో కలిసి షికార్లు చేస్తూ.. దానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు. అమలాపాల్ స్నేహితుడు జగత్ దేశాయ్.. వీరిద్దరూ క్లోజ్.. ఇటీవల ఫారిన్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో జగత్ డ్యాన్స్ చేస్తూ హోరెత్తించాడు. కొందరు డ్యాన్సర్లు అమలాపాల్‌ను అతని వద్దకు తీసుకురాగా.. రింగ్ తీసి ప్రపోజ్ చేశాడు. ఎస్.. అన్నట్టు ఆమె కూడా ఆశ్చర్యపోయి.. నవ్వేశారు. ఈ రోజు అమలాపాల్ పుట్టినరోజు.. అందుకే జగత్ ఆ వీడియోను ఇన్ స్టలో పోస్ట్ చేశారు.
కలల రాణి
తన కలల రాణి.. ఎస్ చెప్పింది అంటూ వీడియో కింద రాశారు. వెడ్డింగ్ బెల్స్ హ్యాష్ ట్యాగ్ దానికి జోడించారు. అమలాపాల్‌కు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కంగ్రాట్స్ అమలాపాల్ అనే కామెంట్లతో ఇన్ బాక్స్ నిండుతోంది.